మాయదారి దోమ (తూర్పుగోదావరి)

 

చింతూరు, ఆగస్టు 27 (globelmedianews.com): 
మాయదారి దోమలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. దోమ కాటుతో మలేరియా, డెంగీ, బోదకాలు, మెదడువాపు వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దోమకాటుతో సంక్రమించే వ్యాధులకు సకాలంతో మందులు వాడకపోతే ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందే. మలేరియా, డెంగీ వ్యాధులు సోకి మృత్యువాతపడిన సంఘటనలు చాలా ఉన్నాయి.  దోమల ఉద్ధృతి జరగకుండా పరిసరాలను పరిశుభ్రతగా ఉంచడమే ప్రధానమైన మార్గం. ఇది ఎక్కడా సాధ్యం కావడం లేదు. ఎక్కడ చూసినా చెత్తతో నిండిపోతున్నాయి. దీంతో దోమల ఉద్ధృతి తగ్గడం లేదు. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు ఉండటంతో పాటు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వాటిని నివారించే పరిస్థితి కనిపించడం లేదు. 
మాయదారి దోమ (తూర్పుగోదావరి)

నీటి నిల్వ ఉన్న చోట ఒక్కో దోమ 50 నుంచి 200 గుడ్లు పెట్టి దోమల ఉద్ధృతిని పెంచేస్తుంది. ఇళ్లలో వాడే కూలర్లు, టైర్లు, తాగిపడేసిన సీసాలు, కొబ్బరి బొండాలు వంటి వాటిని స్థావరాలుగా ఏర్పాటు చేసుకుని దోమలు వృద్ధి చేస్తుంటాయి. వీటి నివారణలో అందరు భాగసామ్యులైతేనే దోమల వ్యాప్తికి అడ్డుకట్ట వేసే వీలుంది.మన్యంలో మలేరియా వ్యాధితో చాలా మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో 2016లో 8,33,843 మంది రక్త పూతలు సేకరిస్తే 9,061 మలేరియా కేసులు, 2017లో 8,50,209 మందికి రక్త పూతలు సేకరిస్తే 5,995 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2018లో ఏప్రిల్‌ వరకు 2,02,448 మంది నుంచి రక్త పూతలు తీసుకుంటే 485 కేసులు నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విలీన మండలాల్లో 2016లో 3,924 కేసులు, 2017లో 2,066, 2018లో 633, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 138 మలేరియా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో దోమల ఉద్ధృతి బాగా పెరిగింది. దోమల నివారణకు చాలా రకాల మందులు మార్కెట్‌లో ఉన్నా వీటి నివారణ సాధ్యం కావడం లేదు. మన్యంలోని గ్రామాల్లో దోమల నివారణకు ప్రత్యేకంగా ఇంటింటికీ దోమల మందు పిచికారీ చేసినా నివారించలేని పరిస్థితి నెలకొంది. దీంతో దోమ కాటుతో చాలా మంది జ్వరాలబారినపడి ఆసుపత్రుల పాలవుతున్నారు.

No comments:
Write comments