స్కూటరు టెంపో ట్రావెలర్ డీ. ఒకరి మృతి. ముగ్గురికి గాయాలు

 

మంత్రాలయ ఆగస్టు,12  (globelmedianews.com -Swamy Naidu)
ద్విచక్ర వాహనాన్ని  టెంపో ట్రావెలర్  ఢీకొని ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం  మండల పరిధిలోని  చెట్నిపల్లి గ్రామ సమీపాన మోహినీపురం  దగ్గర జరిగింది.ఈ  ప్రమాదంలో  సరోజమ్మ అనే మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  మాధవరం చెందిన వడ్ల  తిమ్మప్ప ఆయన భార్య సరోజమ్మ  వీరేంద్ర  కూతురు సుకన్య  ద్విచక్రవాహనంపై  మాధవరం నుండి  మంత్రానికి వెళ్తుండగా  మార్గమధ్యంలో  మోహిని పురం దగ్గర  కర్ణాటకకు చెందిన  కేఏ.28.8801   ఈ నెంబర్ గల  టెంపో ట్రావెలర్  వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.  
స్కూటరు టెంపో ట్రావెలర్ డీ. ఒకరి మృతి. ముగ్గురికి గాయాలు  
తీవ్ర గాయాలపాలైన వారిని 108 అంబులెన్స్లో ఎమ్మెగనూరు ప్రబుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో  తిమ్మప్ప భార్య సరోజమ్మ  మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురికి తీవ్రగాయాలయిన  తిమ్మప్ప వీరేంద్ర కూతురు సుకన్యలకు మెరుగైన చికిత్స  అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

No comments:
Write comments