మళ్లీ టీడీపీ నేతలు వాయిస్ పెరుగుతోందా

 

గుంటూరు, ఆగస్టు  26, (globelmedianews.com - Swamy Naidu
వైఎస్ జగన్ సర్కార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించిన కొందరు టీడీపీ నేతలు ఇప్పుడిప్పుడే కలుగులో నుంచి బయటకు వస్తున్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలకు రివర్స్ టెండర్లకు వెళతానని జగన్ సర్కార్ చెప్పడంతో ప్రభుత్వం పై వ్యతిరేకత తీవ్రంగా ఉందని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న టీడీపీ నేతలు సయితం బయటకు వస్తున్నారు.ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చెలాయించిన నేతలందరూ కామ్ అయిపోయారు. జగన్ ప్రభుత్వం ఏర్పడటంతో వీరు ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొందరు ఏకంగా పార్టీని వీడుతున్నారు. మంత్రిగా వ్యవహరించిన ఆదినారాయణరెడ్డి లాంటి నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు. 
మళ్లీ టీడీపీ నేతలు వాయిస్ పెరుగుతోందా
జగన్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న భయంతోనే వారు పార్టీని వీడుతున్నారు.మరికొందరు సీనియర్ నేతలు సయితం ఇప్పటి వరకూ యాక్టివ్ కాలేదు. ఓటమిపాలయిన సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, అశోక్ గజపతి రాజు, అమర్ నాధ్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలు ఇంకా మౌనంగానే ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే వారిని బయటకు రప్పిస్తున్నట్లు టీడీపీ నేతలే సరదాగా 
వ్యాఖ్యానిస్తున్నారు.ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా మళ్లీ యాక్టివ్ అయినట్లే కన్పిస్తుంది. రాజధాని, అమరావతి నిర్మాణాలపై జగన్ సర్కార్ పై సోమిరెడ్డి విరుచుకుపడ్డారు. ఇక ఓటమి నైరాశ్యంతో ఉన్న మిగిలిన టీడీపీ నేతలు కూడా త్వరలోనే లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశముందంటున్నారు. అయితే టీడీపీ నేతలు ఊహించినట్లుగా ప్రజల్లో జగన్ సర్కార్ పై అంత వ్యతిరేకత ఉందా? ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు ఊహించుకున్నట్లే ఇప్పుడూ అలానే చేస్తున్నారా? అన్నది భవిష్యత్తులో తేలనుంది. ఎందుకంటే జగన్ కు ఇంకా నాలుగున్నరేళ్ల పైన పాలనకు సమయం ఉంది కాబట్టి.

No comments:
Write comments