కరీంనగర్ లో వర్షాభావ సమస్య

 

కరీంనగర్, ఆగస్టు 2, (globelmedianesws.com - Swamy Naidu)
కరీంనగర్ జిల్లాను వర్షాభావ సమస్య వేధిస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలను పరిశీలిస్తే లోటు బెడద కొట్టొచ్చినట్లే కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జూన్‌, జూలై మాసంలో సాధారణానికన్నా అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు జిల్లాల పరిధిలో 61మండలాలుండగా ఇందులో 25 మండలాల్లో 15 నుంచి 44శాతం మేర లోటు ప్రభావం నెలకొంది.  దీంతో పంటల సాగుపై  ప్రభావం పడబోతోంది. ఇప్పటికే జిల్లాలో కనీసం 30శాతం మేర కూడా పంటల్ని వేయలేదు.ఈ ఏడాదిలోనూ గతేడాది మాదిరిగానే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది అనుకున్నట్లుగా వర్షాలు పడకపోవడంతో పంటలపై విశేష ప్రభవం పడింది.
 కరీంనగర్ లో వర్షాభావ సమస్య

ఈ సారి అదేస్థాయిలో కురియని వర్షాలు దెబ్బతీసేలా ఇబ్బందిని సృష్టిస్తున్నాయి. 2017 జూన్‌ 1వ తేదీనుంచి సెప్టెంబరు 30వ తేదీ నాటికి జగిత్యాల జిల్లాలో 854.7మి.మీ సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా ఆఖరు వరకు కేవలం 540.5మిమీ మేరనే పడి 37శాతం తక్కువ చిక్కుతో ఈ జిల్లా వాసులు ఇక్కట్లు పడ్డారు. పెద్దపల్లి జిల్లాలోనూ 38శాతం తక్కువ తీవ్రతతో 549.6మిమీ మేరనే వానా కాలంలో పడింది. సాధారణ వర్షపాతం 889.0 మి.మీకన్నా 339.4మిమీ లోటు దరిచేరింది. కరీంనగర్‌ జిల్లాలో జిల్లా సగటు 716.9మి.మీ కాగా 586.2మిమీ పడింది. 18శాతం కొరత ఇబ్బంది ఈ జిల్లా ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సిరిసిల్ల జిల్లాలోనూ 718.3మి.మీ కుగాను 526.5మిమీ పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ జిల్లాలో 27శాతం మేర తక్కువ జల్లులు కురిశాయి.ఉమ్మడి జిల్లాలో జూన్‌, జులై నెలల్లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే లోటు(-85.1మి.మీ) వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా రెండు మాసాల్లో 1754.2మి.మీకుగాను 1669.1మి.మీ పడింది. జగిత్యాల జిల్లాలో గడిచిన 61రోజుల్లో 472.2మి.మీ వర్షం కురియాల్సి ఉండగా 451.3మి.మీ కురిసింది. 20.9మి.మీ(-4శాతం) తక్కువగా నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో మాత్రం జిల్లా సగటు పరంగా చూస్తే మోస్తరుగా ఎక్కువ చినుకులే పడ్డాయి. 501.2 మి.మీ సాధారణ గణంకాలను అధిగమించేలా 567.3 మి.మీ మేర జల్లులు పడ్డాయి. కరీంనగర్‌, సిరిసిల్ల జిల్లాలో మాత్రం ఎక్కువ ప్రభావం పడింది. సిరిసిల్లలో అత్యధికంగా 90.3మి.మీ మేర వ్యత్యాసముంది. ఇక్కడ 389.1మి.మీ సాదారణ వర్షపాతానికిగాను 298.8మి.మీ మేర వరుణుడు కరుణ చూపించడంతో అసలుకే ఎసరనేలా(-23శాతం) గరిష్ఠంగా తీవ్రత కనిపిస్తోంది. ఇక కరీంనగర్‌ జిల్లాలో కూడా ఇదే తరహాలో వర్షభావ పరిస్థితులు రైతులతోపాటు అందరిని వెంటాడుతున్నాయి. సాధారణ వర్షపాతం 391.7మి.మీకుగాను 351.7మి.మీ మేర కురిసింది. ఈ జిల్లాలోనూ 10శాతం లోటు బెడద వెంటాడుతోంది.విత్తనం వేసి సాగులో తీరిక లేకుండా ఉండాల్సిన రైతుకలవరపడేలా పరిస్థితులు కళ్లముందున్నాయి. అనుకున్నస్థాయిలో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరలేదు. భూగర్భజల మట్టం కూడా అంతగా పెరగలేదు. కొన్నిమండలాల్లో చుక్క చినకు పడిన దాఖాలాలు ఇటీవల రోజుల్లో లేనేలేవు. వచ్చిన మేఘాలు వచ్చినట్లే తరలిపోతున్నాయి. ఈ వర్షకాలంలో 25 మండలాల్లో సగటు తీవ్రత గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 15శాతానికన్నా అధికంగా మండలాల్లో వరుణుడు బెంగను పెంచుతున్నాడు. 

No comments:
Write comments