స్థిరంగా శ్రీశైలం వరద ప్రవాహం

 

కర్నూలు ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu)
ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 7.53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయానికి 8.92లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా..8.60 లక్షల క్యూసెక్కుల ఔట్ఫ్లో నమోదవుతోంది. 
స్థిరంగా శ్రీశైలం వరద ప్రవాహం
జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.6 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం197.01 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38,140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,157 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హంద్రీనీవాకు 2,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా..పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 35 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

No comments:
Write comments