వారాంతపు సంత.... వ్యాధులు వస్తాయోమోనని చింత మురికి కాలువ, బురదలో విక్రయాలు

 

గోపాల్ పేట ఆగష్టు 13 (globelmedianews.com - Swamy Naidu
మండల కేంద్రమైన గోపాల్ పేట లో ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంత లో కొనుగోలు చేస్తే వ్యాధుల బారినపడతామేనని మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. సంత బస్టాండ్ ప్రాంతాలలో,  మురుగు కాల్వల ప్రక్కనే, పందుల సంచారాలు, గుంతలు పడి బురదమయం గా మారిన రోడ్ల కిరుప్రక్కల వివిధ రకాల వ్యాపారాలు జరుగుతుండటం వల్ల వీటినుంచి వ్యాధులు ఎక్కడ వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాకాలం, ఆపై వ్యాధుల సీజన్ కావడం వల్ల ఈగలు, దోమలు, పందులు  వల్ల రోగాలు ఎక్కడ వస్తాయో నని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంతలో విక్రయాలు జరిపే వారికి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొందని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ప్రధాన ఆర్అండ్ బీ  రోడ్డు ప్రక్కనే పెట్టి మిరపకాయల విక్రయాలు జరుగుతుండటం వల్ల వాటినుంచి ఏ సమయంలో ఏం ప్రమాదం జరుగుతుందోనని వాహనాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. 
 వారాంతపు సంత.... వ్యాధులు వస్తాయోమోనని చింత
మురికి కాలువ, బురదలో విక్రయాలు
రోడ్ల కిరు ప్రక్కల విక్రయాలు జరుగుతుండడం వల్ల గ్రామంలో కి ఎళా వెళ్లాలనీ ప్రజలు, వాహనాల వారు విమర్శిస్తున్నారు.  చేతులు కాలక ఆకులు పట్టుకోవడం ఏంటి.  రోగాలు రాకముందు చర్యలు చేపట్టాల్సిన అధికారులు రోగాలు వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మండల అధికారులు కార్యాలయాలకు వెళ్లే రోడ్డుపై ఈ పరిస్థితి నెలకొని ఉండగా వారికి ఈ దుస్తుతి  కనిపించడంలేదని వారు ప్రశ్నించ సాగారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మురుగు కాల్వల ప్రక్కన, బురద నీటిలో విక్రయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుని మహిళల ఆందోళన ను రూపుమాపాల్సిన అవసరం వారిపై ఎంతగానో ఉంద నీ ప్రతి ఒక్కరు వ్యక్తపరుస్తున్నారు. 

No comments:
Write comments