పేరుకే కంప్యూటర్ విద్య... అంతా మిధ్య

 

ఖమ్మం, ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 251 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు రెండు విడతలుగా కంప్యూటర్లను అందజేసింది. 2008లో 198 పాఠశాలలు, 2009లో 53 పాఠశాలలను ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాలకు 11 కంప్యూటర్లు, విద్యుత్తు లేని సమయంలో వాడుకునేందుకు జనరేటర్ సౌకర్యం ఏర్పాటుచేశారు.ఐదేండ్ల ఒప్పందంతో పాఠశాలకు ఇద్దరు చొప్పున 502 మంది తాత్కాలిక బోధకులను నియమంచారు. తరగతుల వారీగా అంశాలను రూపొందించి పుస్తకాలను విద్యార్థులకు అందించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏవిధంగా బోధించాలనే విషయంపై నిట్ సంస్థ బోధకులకు పూర్తి శిక్షణనిచ్చింది. విద్యార్థులు సైతం బోధకులు బోధించిన అంశాలను చక్కగా నేర్చుకున్నారు. ఒప్పందం పూర్తయిన అనంతరం ఆయా పాఠశాలల్లో శిక్షకులు లేక కంప్యూటర్ బోధన ఆగిపోయింది. ప్రత్యేక గదులు కేటాయించి ఏర్పాటు చేసిన కంప్యూటర్లు మూలకు చేరాయి.
పేరుకే కంప్యూటర్ విద్య... అంతా మిధ్య 
వీటి కోసం కేటాయించిన జనరేటర్లు, ఫర్నీచర్  పాడవుతున్నాయి. అనంతరం కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజులకే పరిమితమయ్యాయి. ఉపాధ్యాయులకు సంబంధించిన సబ్జెక్టులకే సమయంసరిపోతుండడం. ఇతర బాధ్యతలతో వీటిపై దృష్టిపెట్టలేదు. కొన్ని పాఠశాలల్లో పాఠశాల నిర్వహణకు సంబంధించి ఒకట్రెండు కంప్యూటర్లు వినియోగిస్తున్నారు. ఆధునీక యుగంలో కంప్యూటర్లకు ఉన్న ప్రాధాన్యం ఎనలేనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాటిని మూడనపడేయడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ ప్రపంచంలో వెనుకపడే ప్రమాదం ఉంది. తరగతుల నిర్వహణకు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే కొంత వరకు ప్రయోజనం కలుగనుంది. పాఠశాల యాజమాన్యం కమిటీల సమావేశాల్లో చర్చించి పాఠశాల నిర్వహణ గ్రాంటు ద్వారా శిక్షకులను ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులో కొంత చొరవ తీసుకుంటే విద్యర్థులకు మేలు జరుగుతుంది. రెండేళ్ల క్రితం కంప్యూటర్ స్థితిగతులపై వివరాలు సేకరించి నిపుణులు వీటిలో చాలా వరకు పాడైనట్లు తేల్చారు. నిర్వహణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ తరగతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటి వరకు కంప్యూటర్ గురించి అసలేం తెలియదు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా నేర్పించే వారు లేకపోవడంతో వాటి గురించి తెలుసుకోవాలనే అవకాశం లేకుండా పోయింది. తరగతులు ప్రారంభించి విద్యార్థులందరికీ నేర్పిస్తే ఎంతో ప్రయోజనంగా ఉంటుంది.

No comments:
Write comments