గరిష్ట స్థాయికి చేరుకున్నశ్రీశైల డ్యామ్ నీటిమట్టం

 

కర్నూలు, ఆగస్టు 21, (globelmedianews.com - Swamy Naidu)
ఎగువ పరి వాహక ప్రాంతమైన జూరాల నుంచి వరద నీరు తగ్గు ముఖం పట్టడం తో నిన్న డ్యామ్ గేట్లు ను మూసివేసిన అధికారులు,అయితే ఎగువ పరీవాహక ప్రాంతాలనుండిస్వల్పంగా వస్తున్న వరద నీటి తో డ్యామ్ నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకోవడంతో రెండు క్రస్ట్ గేట్లను తెరిచి 1,66,869 క్యూసెక్కులు నీటిని దిగువ సాగర్ కు విడుదుల చేస్తున్నారు. 
 గరిష్ట స్థాయికి చేరుకున్నశ్రీశైల డ్యామ్ నీటిమట్టం
శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పత్తి అనంతరం  టోటల్అవుట్ ఫ్లో 1,66,869 క్యూసెక్కులు గా నమోదయింది. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.90 అడుగులు వుంది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 215.3263 టీఎంసీలుగా నమోదయింది.

No comments:
Write comments