ధైర్యంగా విధులు నిర్వహించండి ఐపీఎస్ దీక్షాంత్ పెరేడ్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా

 

హైదరాబాద్, ఆగస్టు 24, (globelmedianews.com - Swamy Naidu)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమీ లో70వ బ్యాచ్కు చెందిన 92 మంది ఐపీఎస్ ల దీక్షాంత్ కార్యక్రమానికి హజరనయ్యారు. అమిత్ షా మాట్లాడుతూ  ఐపీఎస్ లు దేశాభివృద్దికి పాటుపడాలని అన్నారు. పేదరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలి. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ సత్ఫలితాలు సాధించాలి. 
ఐపీఎస్ దీక్షాంత్ పెరేడ్ లో కేంద్ర హోం మంత్రి  అమిత్ షా
రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతినకుండా, ధైర్యంగా విధులు నిర్వహించాలి అని అమిత్ షా ఐపీఎస్లకు సూచించారు. మధ్యాహ్నం పోలీస్ అకాడమీ సీనియర్ అధికారులతో సమావేశమంలో అమిత్ షా పర్యటన ముగిసే వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అయితే ముందస్తు షెడ్యూల్ ప్రకారం శనివారంమంతా  హైదరాబాద్లోనే ఉండాల్సి ఉన్నప్పటికీ భాజపా సీనియర్నేత అరుణ్ జైట్లీ కన్నుమూయడంతో మధ్యలోనే ఆయన పర్యటన ముగించుకొని ఢిల్లీకి పయనమయ్యారు.

No comments:
Write comments