చదువు చెప్పేవారేరీ..? (ఖమ్మం)

 

ఖమ్మం, ఆగస్టు 20 (globelmedianews.com - Swamy Nadu): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఉన్నత పాఠశాలల్లో ఉద్యోగ విరమణ చెందిన వారి సబ్జెక్టుల స్థానంలో బోధన కుంటుపడుతోంది. ఉమ్మడి జిల్లాలో 10మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 128 ఉన్నాయి. వీటిలో 27 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు. అదే విధంగా పది మంది లోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు నాలుగు ఉన్నాయి. వీటిలో ఖమ్మం అర్బన్‌ మండలం బూడిదంపాడులో, తల్లాడ మండలం బస్వాపురంలో ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇల్లెందు మండలం కొత్తపల్లి యూపీఎస్‌లో 10మంది, తల్లాడ మండలంలోని నర్సింహారావుపేట యూపీఎస్‌లో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు.పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఉపాధ్యాయులు, విద్యార్థి నిష్పత్తి బాగా తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి అవసరమైన చోటకు ఉపాధ్యాయులను మండల పరిధిలో సర్దుబాటు చేయాలని ఆదేశించారు. 
 చదువు చెప్పేవారేరీ..? (ఖమ్మం)

10లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 20లోపు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను కొరత ఉన్న ప్రాంతాలకు సర్దుబాటు చేయాలని, మండల పరిధిలో అవసరం లేకపోతే పొరుగు మండలంలోని పాఠశాలకు పంపాలిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించాలని, వారికి రవాణా భత్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులు గత జూన్‌లోనే వచ్చినప్పటికీ ఇంత వరకు జిల్లాలో 50శాతం ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు చేయలేదు. దీంతో అనేక పాఠశాలల్లో వందలాది మంది ఉపాధ్యాయులు బోధించే అవకాశంలేని పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు 30-40 ఉన్నత పాఠశాలల్లో గణితం, ఆంగ్లం, సైన్స్‌ వంటి ముఖ్యమైన సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నా అధికారులు పట్టించుకోవటం లేరని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇటీవల టీఆర్‌టీ నియామకాల ద్వారా 38మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. వీరి స్థానంలో పనిచేస్తున్న విద్యా వాలంటీర్లను విధుల నుంచి తొలగించటంతో వారు ఉపాధి కోల్పోయారు. కనీసం ఈవిషయంలో డీఈవో చొరవ తీసుకుని ఎక్కడ అవసరం ఉందో అక్కడ వీరిని నియమించేందుకు చొరవ తీసుకుంటే విద్యార్థులు నష్టపోయే పరిస్థితి రాదని సంఘాల నాయకులు చెబుతున్నారు.

No comments:
Write comments