పంజా విసురుతున్న వైరల్ జ్వరాలు

 

హైద్రాబాద్, ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
వాతావరణం మార్పిడితో వైరల్ జ్వరాలు పంజా విసురుతున్నాయి. నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్రమంగా రోగుల తాకిడి పెరుగుతోంది. నిత్యం 600800 మంది ఓపీకి వస్తుండగా అందులో 5060 శాతం మంది వైరల్ లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రధానంగా జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు లక్షణాలతో బాధపడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్ముందు వైరల్ జ్వరాల భారిన పడేవారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. సాధారణ చికిత్సతోనే వైరల్ జ్వరం తగ్గిపోతుందని వైద్యలు సూచిస్తున్నారు. విశ్రాంతితోపాటు నీళ్లు ఎక్కువగా తాగడం, వైద్యుల సూచనల మేరకు మందులు వాడితే 4 నుంచి 6 రోజుల్లో తగ్గిపోతుందంటున్నారు.
 పంజా విసురుతున్న వైరల్ జ్వరాలు
దగ్గినా, తుమ్మినా చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. వైరల్ జ్వరంతో బాధపడుతున్న వారు చిన్నపిల్లలకు ఎత్తుకోక పోవడం మంచిందని వైద్యులు సూచిస్తున్నారుప్రధానంగా వాతవరణ మార్పులతో అధిక శాతం మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. వీరిలో చిన్నారుల సంఖ్య అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.జ్వరం ఇతర లక్షణాలు ఐదురోజుల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే నిర్లక్షం వహించకుండా వైద్యులను సంప్రదించాలి. వైరల్ జ్వరాలకు చాలా మంది వైద్యుల సూచనల మేరకు కాకుండా వారి ఇష్టానుసారంగా మందులు వాడుతారు. ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు 
హెచ్చరిస్తున్నారు.గ్రేటర్ పరిధిలో మలేరియా కేసులు చాపకింద నీరులా నమోదవుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఈ ఏడాది ఇప్పటికే మలేరియా కేసులు 300లకు పైగానే నమోదైనట్లు తెలుస్తోంది. మలేరియాలో సీఎఫ్ కేసులతో పాటు, మలేరియా పివి  కేసులు కూడా నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గతేడాది మలేరియా కేసులు సుమారు వేయి వరకు నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా అదే తరహాలో కేసులు నమోదవుతుండటం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పారిశుద్ధం లోపించడంతోనే దోమలు విజృంభిస్తున్నాయి. దోమల నివారణకు ప్రభుత్వం లక్షల రూపాయాలు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్(పివి), ప్లాస్మోడియం ఫాల్సీ ఫారమ్  అనేవి రెండు రకాలుఉంటాయి. జ్వరం, ఒళ్లు నొప్పులె పివి లక్షణాలు. ఇది మొదటి స్టేజి. దీని తీవ్రత తక్కువగా ఉంటుంది. పిఎఫ్ కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చలి, జ్వరం, తల, ఒళ్లు నొప్పులు, వాంతులు లాంటివి దీని లక్షణాలు. ఇలాంటి కేసులు అరుదుగా నమోదవుతాయి. పిఎఫ్ త్వరగా గుర్తించి వైద్యం అందించకపోతే కాలేయం,మూత్రపిండాలు, రక్తకణాలపై ప్రభావం పడుతోంది. మెదడుపై ప్రభావం పడి సిరబ్రల్ మలేరియాకు దారితీస్తుంది. మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ అనాఫిలస్ కల్సి ఫేసిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇవి ఎక్కువగా మురుగు కాల్వలు, చెరువులు, కుంటలు, పంట కాల్వలు, పొలాల్లో, పూల కుండీలు, టైర్లలోని నీటి నిల్వల్లో పెరుగుతాయి. ఇవి రాత్రిల్లు కుడతాయి. దోమ కాటుతో శరీరంలోకి ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్నజీవి ఎర్రరక్త కణాలపై దాడి చేస్తుంది. ఈ వ్యాధుల విషయంలో అధికారులు ముందుస్తుగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No comments:
Write comments