జగన్ వి మూర్ఖ నిర్ణయాలు

 

విజయవాడ, ఆగస్టు 22 (globelmedianews.com)  
పోలవరం ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మూర్ఖంగా ఉన్నాయని మండిపడ్డారు. తాము మొదటి నుంచి పోలవరం టెండర్లు విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నామని.. వినకుండా టెండర్లు రద్దు చేశారన్నారు. 
 జగన్ వి మూర్ఖ నిర్ణయాలు

హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు చంద్రబాబు. టెండర్ల రద్దు ప్రభావం ప్రాజెక్టుపై ప్రభావం చూపుతుందని.. మరింత ఆలస్యమవుతుందని అన్నారు. ప్రాజెక్ట్ విషయంలో నిర్లక్ష్యం వద్దని తాము మొదటి నుంచి హెచ్చరిస్తున్నామన్నారు.. వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందన్నారు. ప్రాజెక్ట్ టెండర్ల విషయంలో లేని అవినీతిని నిరూపించాలని ప్రయత్నించారని.. కానీ కుదరలేదన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? రాష్ట్రానికి పట్టిన శని అనుకోవాలో అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌‌తో ప్రాజెక్టుకు నష్టమని.. కేంద్రం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టెండర్ల విషయంలో న్యాయ వివాదం మొదలైతే ప్రాజెక్ట్‌పై ఆ ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించారు. 

No comments:
Write comments