అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ అందోళన

 

విజయవాడ, ఆగష్టు 16 (globelmedianews.com)
రాష్ట్రంలో తమ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను తెరవాలని టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో టీడీపీ శ్రేణులు ఈ విషయమై ఆందోళనకు దిగాయి. టీడీపీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. పేదలకు రూ.5కే భోజనం అందిస్తున్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. 
అన్న క్యాంటీన్ల మూసివేతపై టీడీపీ అందోళన

ప్రభుత్వం ఇలాంటి ప్రతీకార చర్యలకు దిగడం మంచిది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు కాల్వ శ్రీనివాసులుతో పాటు టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వీరిని స్టేషన్ కు తరలిస్తుండగా మిగిలిన టీడీపీ కార్యకర్తలు పోలీసు జీపులను అడ్డుకున్నారు. దీంతో పోలీస్ అధికారులు వీరిపై  లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కృష్ణా జిల్లా జక్కంపూడి  కాలనిలో అన్న క్యాంటీన్ మూసివేతకు నిరసనగా మాజీ మంత్రి దేవినేని ఉమా ధర్నా చేసారు. పేదవాడి ఆకలి తీర్చే అన్న కాంటీన్లు మూసివేసే హక్కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారని అయన ప్రశ్నించారు.

No comments:
Write comments