భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం అందించాలి - జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన

 

పెద్దపల్లి  ఆగస్టు 09 (globelmedianews.com - Swamy Naidu):
మన భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం అందించడం మన అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు.  స్వచ్చ్ శుక్రవారం కార్యక్రమంలో భాగంగా  శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామాన్ని కలెక్టర్  పరిశీలించి  గ్రామంలో నిర్వహించిన  ఇంటింటికి మహాలక్ష్మి  కార్యక్రమంలో   పాల్గోని మొక్కలను నాటారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటే ముందు వృక్షాలను దైవంగా భావిస్తూ హరిత వ్రతం నిర్వహించారు.  అనంతరం  గ్రామపంచాయతిలో నిర్వహించిన సమావేశంలో  కలెక్టర్ పాల్గోన్ని మాట్లాడుతూ  భూమితో పాటు  వీనస్ అనే గ్రహంలో సైతం  గతంలో నీరు, చెట్లు అందుబటాలో  ఉండేవని,  అక్కడ పర్యావరణంలో కలుషిత వాయువు అధికం కావడం వల్ల మానవ మనుగడ సాధ్యం కాలేదని, భూ గ్రహం లో మాత్రమే మానవ మనుగడ సాధ్యం అయిందని తెలిపారు
భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణం అందించా-   జిల్లా కలెక్టర్  శ్రీదేవసేన
భూమిపై సైతం కాలుష్యం పెరుగుతుందని, దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని, నాగరికత కారణంగా చెట్లను తొలగించడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. మనకు గతంలో  దేశవ్యాప్తంగా మంచినీరు సులభంగా లభించేదని, ప్రస్తుత పరిస్థితుల్లో రక్షిత మంచినీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం కారణంగా రాష్ట్ర మన జిల్లాలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు సరఫరా చేస్తున్నామని, ఇదే తరహా కార్యక్రమం దేశవ్యాప్తంగా చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు.  గ్రామాల్లో పచ్చదనం తగ్గిపోవడం వల్ల వర్షాలు సకాలంలో రావడం లేదని, పచ్చదనం పెంచి గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దితే సకాలంలో వర్షాలు కురిసే ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ఇంటింటికి హరిత మహాలక్ష్మి కార్యక్రమం నిర్వహిస్తూ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో 5 మొక్కలను నాటుతున్న మని, నాటిన మొక్కలను సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ తెలిపారు. హరితహారం కార్యక్రమం పేరిట మొక్కలను నాటడం తో పాటు వాటిని సంరక్షించడం చాలా కీలకమని, ఈరోజు ఇంట్లో నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించి పెంచాలని కలెక్టర్ ప్రజలను కోరారు. గ్రామాల్లో మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కురిసే వర్షాలను భూగర్భ జలాలు గా మలిచే ప్రయత్నం చేయాలని, కిష్టంపేట గ్రామంలో ప్రతి ఇంట్లో మ్యాజిక్ సోక్ పిట్  నిర్మాణం జరిగిందని, దీని కోసం కృషి చేసిన  గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామ అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.  గ్రామంలో చెత్త నిర్వహణ వ్యవస్థ మెరుగుపరుచుకోవాలని, గ్రామస్తులంతా ఐక్యంగా ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్తను వేరు వేరుగా సేకరించాలని, పొడి చెత్త లో ప్లాస్టిక్ వస్తువులను ప్రత్యేకంగా ఒక సంచిలో వేసి గ్రామపంచాయతీకి అప్పగించాలని, ఆ ప్లాస్టిక్ నే మళ్ళీ ఉపయోగించే విధంగా ఇతరులకు విక్రయించడం జరుగుతుందని, తద్వారా గ్రామ పంచాయతీకి కొంతమేర ఆదాయం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో సోక్ పిట్  నిర్మాణ పనులు జరిగాయని, దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో నాళాలను తొలగించిన మొదటి జిల్లా పెద్దపల్లి ఆవిర్భవిస్తుందని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్న 1,23,036 గృహాలలో ప్రతి ఇంటికి ఐదు మొక్కలు చొప్పున 6,15,180 మొక్కలను ఒకేసారి నాటామని,  వీటిని పూర్తిస్థాయిలో సంరక్షించాలి అనే కలెక్టర్ కోరారు. గ్రామానికి అవసరమైన రోడ్డు నిర్మాణాలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రజాప్రతినిధులు అధికారులు తయారుచేస ప్రజా ప్రతినిధులు అధికారులు తయారుచేయించి నివేదిక అందజేయాలని, తన పరిధిలో ఉన్న నిధులతో రోడ్ల నిర్మాణం పనులు చేపడతామని కలెక్టర్ గ్రామస్తులకు తెలిపారు. అనంతరం గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ మరుగుదొడ్డిని కలెక్టర్ ప్రారంభించారు.  అనంతరం బందంపల్లి వద్ద సింగరేణి ఆధ్వర్యంలో రాజీవ్ రహదారి వెంబడి నిర్వహించిన హరితహారం కార్యక్రమం లో పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. జాతీయ రహదారి వెంబడి నాటే మొక్కలకు తప్పనిసరిగా ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలని, నాటిన మొక్కలను సంరక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, జిల్లా అటవీ అధికారి రవి ప్రసాద్, కాల్వ శ్రీరాంపూర్ తహససిల్దార్ రవీందర్, ఎంపీడీవో కిషన్, మండల ప్రత్యేక అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి  సుదర్శన్, గ్రామ సర్పంచ్ కాస తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీపీ నూనెటి సంపత్, జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments:
Write comments