నెల్లూరులో వాన జాడేది

 

నెల్లూరు, ఆగస్టు 2, (globelmedianews.com - Swamy naidu)
జిల్లాలో అధిక వర్షపాతం ఈశాన్య రుతుపవనాల ద్వారా నమోదువుతుంది. జూన్, జూలైలో కురిసే వర్షాలే ఖరీఫ్‌ పంటకు ప్రాణంగా నిలుస్తాయి. సాధారణంగా జూన్‌ 1,2 తేదీల్లో నైరుతి పవనాలు కేరళను తాకి వారం రోజలు వ్యవధిలో లేదంటే 10 రోజుల్లో జిల్లా అంతటా విస్తరించి వాతావరణం చల్లబడి వర్షాలు పడేవి. ఈ ఏడాది  నైరుతి రుతు పవనాలు కదిలిక, గమనం గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా ఆలస్యంగా జూన్‌ 25వ తేదీ వరకు సమయం తీసుకున్నాయి. అప్పుడైనా వర్షాలు కురిశాయా అంటే అదికూడా లేదు.జిల్లాలో వర్షాలు సకాలంలో కురవక పోవడంతో వ్యవసాయం గత ఐదేళ్లుగా కన్నీళ్ల సేద్యంగా మారింది. ఎండిపోయిన జలాశయాలు, అడుగంటిపోయిన భూ గర్భజలాలు వెరసి ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకంగా మారింది. అయినా సరే సాగు విషయంలో మాత్రం రైతులు వెనకడుగు వేయడంలేదు.
నెల్లూరులో వాన జాడేది


ఈ ఏడాదైనా పంట చేతికి రాకుండా పోతుందా..? అనే కొండంత ఆశతో రైతులు ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల పడిన అరకొర వర్షాలతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకుని విత్తుకునే సమయానికి వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారం రోజులుగా వాతవరణంలో మార్పు చోటు చేసుకుని వర్షం పడేలా నల్లని మేఘాలతో రైతులను ఊరిస్తూ నిరాశలోకి నెడుతున్నాడు.జూన్‌ మొదటి వారంలో ఆరేబియా సముద్రంలో ’వాయు’ తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల కదిలికకు అంతరాయం ఏర్పిడింది. అది గుజరాత్‌ వద్ద తీరం దాటకుండా ఓమెన్‌ వైపు ప్రయాణించడంతో ఈ పరిస్థితి వచ్చిందని వాతావరణ నిపుణలు అంచనా వేశారు. ఆ తర్వాత కోస్తా ఆంధ్రా ప్రాంతానికి దగ్గరగా పశ్చమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడం, ఉత్తర బంగాళా ఖాతంలో మరో ఆవర్తనం కారణంగా జూన్‌ మొదటి వారంలో రావాలిసిన నైరుతి పవనాలు ఆ నెల 25వ తేదీ వరకు సమయం తీసుకున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఆపైన రుతు పవనాల ప్రభావం జిల్లాపై అంతగా చూపలేదు. నైరుతి విస్తరించి జిల్లా అంతటా వర్షాలు పడాల్సి ఉన్నా, ఆ పరిస్థితి కనిపించలేదు. మే నెల్లో సాధారణ వర్షపాతం 107.4 మీ.మీ. కాగా, కేవలం 4.6 మీ.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్‌లో 56.8కి గానూ 12.9 మీ.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఈ నెల్లో ఇంతవరకు 139.3గానూ 101 మాత్రమే వర్షపాతం నమోదైంది. అంటే జిల్లా వ్యాప్తంగా ఇప్పుటి వరకు –27.5 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూలైలో ద్వితీయ పక్షంలో ఉదయగిరి మెట్టప్రాంతంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడడంతో మెట్ట రైతులు పంటలు వేసేందుకు ముందుస్తు దుక్కులు దున్నుతున్నారు. అక్కడక్కడా కంది సాగు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో మంచి వర్షాలు కురిస్తే సుమారు లక్ష ఎకరాల్లో మినుము, పెసర, కంది తదితర మెట్ట పైర్లు సాగు చేస్తారు. ఈ రెండు నెలల్లో కురిసే వర్షాలు ఆధారంగా చెరువులు, కుంటలు, జలాశాయల్లో నీరు చేరికను బట్టి ఖరీఫ్‌ వరి సాగు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి గమనిస్తే ప్రధాన జలాశయం సోమశిల పూర్తిగా అడుగంటిపోయింది. గండిపాళెం, నక్కలగండి, కండలేరు తదితర జలాశయాలు నిండుకున్నాయి. గత రెండు రోజలు నుంచి మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతెంది. ఆదివారం జిల్లా అంతటా దట్టమైన మేఘాలతో ఆకాశం ఆవరించి వర్షం కురుస్తుందనే భావన కలిగించింది. నీటి చుక్క నేలనైతే తాక లేదు. మరి వరుణదేవుడు కరిణస్తాడో... లేక మబ్బులతో దోబూచులాడి ఉస్సూరమనిపిస్తాడో లేక అన్నదాత ముఖాల్లో ఆనందం కురిపిస్తాడో వేచి చూడాలి.

No comments:
Write comments