విపత్తులను ఎదుర్కోవడానికి సిద్దం

 

ఒంగోలు, ఆగస్టు 29,(globelmedianews.com): 
జిల్లా తుఫాన్ లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడానికి సిద్ధం గా  వున్నామని  జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. గురువారం స్ధానిక ప్రకాశం భవనంలోని ఆయుద ఛాంబర్ లో ప్రకృతి వైతరీత్యాలను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యల పై యునైటెడ్  స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రకృతి వైపరీత్యాల కన్సల్టెంట్స్లకు జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోస్తా తీర ప్రాంతంలో  11 మండలాలు వున్నాయన్నారు.   ప్రస్తుతం అందుబాటులో వున్న వాతావరణ  శాఖ అంచనాల ప్రకారం తుఫాన్ ల ప్రభావాన్ని అంచనా వేసుకుంటూ ప్రజల ప్రాణ, ఆస్థి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కోస్తా తీర ప్రాంతంలో  ప్రజలను తుఫాను సమయంలో  అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. తుఫాను సమయంలో రెవిన్యూ  యంత్రాంగం ప్రజలకు అవసరమైన అత్యవసర సేవలందించడం జరుగుతుందన్నారు.  
విపత్తులను ఎదుర్కోవడానికి సిద్దం

ప్రకృతి వైపరీత్యాల శాఖ ప్రజలను వరద ముంపుకు గురికాకుండా బోట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు. విద్యుత్ శాఖ కోస్తా తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా  చర్యలు తీసుంకుంటుందన్నారు.  ప్రకాశం జిల్లాలో భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా సముద్రానికి సమాంతరంగా కోస్తా గ్రామాలు వున్నాయన్నారు. దాని వల్ల  దాదాపు వరద ముంపుకు  గురయ్యే అవకాశాలు తక్కువగా వుంటాయని ఆయన తెలియజేశారు. తుఫాను, వరదల సమయంలో ప్రజలను రక్షించడం , వారికి పునరావాస సౌకర్యాలు కల్పించడం ప్రధానంగా  రెవిన్యూ శాఖ చేపడుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యు.ఎస్.సిటిజన్ సర్వీసెస్ అమెరికన్ ప్రకృతి వైపరీత్యాల కన్సల్టెట్ జనరల్ జాకబ్  డి.డైర్మాన్, కౌన్సిలర్ మానస గొండేల మీట్లాడుతూ భారత దేశ ప్రజలకు అమోరికా దేశంలో తుఫాన్లు, వరదలు వచ్చినప్పుడు సురక్షిత, పునరావాస సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్  కోస్తా  జిల్లాలలో  ప్రజలకు తుఫాన్లు, ప్రకృతి  వైపరీత్యాల  సమయాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి  ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చామని  వారు తెలియజేశారు. ఈ సమావేశం ట్రైని కలెక్టర్ సూరజ్ దనజయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట సుబ్బయ్య, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్  శ్రీరామముర్తి, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్ర నాధ్  ఠాగూర్, గ్రామీణ నీటి  సరఫరా శాఖ ఎన్.ఇ.సంజీవ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు, జిల్లా పౌర శాఖా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యా శాఖాధికారి వినోద్ కుమార్, ఎస్ .ఇ.సుబ్బరాజు, ఒంగోలు ఆర్టీఓ పెంచల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.     

No comments:
Write comments