బస్సును ఢీకొన్న లారీ…డ్రైవర్ మృతి

 

గన్నవరం ఆగస్టు 7 (globelmedianews.com)
కృష్ణాజిల్లా గన్నవరం జాతీయ రహదారిపై శాంతి థియేటర్ ఎదుట బుధవానం  తెల్లవారుజామున ఆగిఉన్న ఆర్టిసి బస్సుని వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. వివరాలు ఇలా వున్నాయి. కాకినాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు టైర్ పంచర్ అయింది. దాంతో డ్రైవర్ బస్సు దిగి  టైర్ మారుస్తున్నాడు.  
 బస్సును ఢీకొన్న లారీ…డ్రైవర్ మృతి

ఈ క్రమంలో ఆర్టీసీ బస్సును  వెనుకనుంచి వచ్చని లారీ ఢీకొట్టింది. దాంతో కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ అక్కడక్కడే మృతి చెందాడు. బస్సులో వున్న 30 మంది  ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

No comments:
Write comments