వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకున్నమేదరలు

 

ఏలూరు,ఆగష్టు 12 (globelmedianews.com)
స్డానిక 43వ డివిజన్ కు చెందిన 200 మంది మేదర కుటుంబ సభ్యులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  ఆళ్లనాని సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకున్నారు. స్థానిక మంత్రీ కేంపు కార్యాలయంలో సోమవారం  ఆళ్లనాని కేక్ కట్ చేసి మేధర కుటుంబాలకు స్వాగతం పలికారు. జీవితాంతం బుట్టలు అల్లుకోవడం, ఇతర చేతివృత్తి చేసుకోవడమే తప్ప మేధుర కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ది సాధించలేద ని, ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్న కార్యక్రమాలు పేద మేదర కుటుంబాలకు వర్తింపచేసి వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేలా తగు ప్రోత్సాహం అందిస్తానని  
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్దం పుచ్చుకున్నమేదరలు

ఈ సందర్భంగా ఆయన హామీఇచ్చారు. మేదర్లు వృత్తిలో అభివృద్ది సాధించడానికి ప్రభుత్వ పరంగా ఋణ సౌకర్యం కల్పిస్తానని  నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు మేధర్ల మహేంద్ర సొసైటీ నాయకులు  కోలా అప్పారావు, పిల్లిశ్రీను, గ్రంధి సింహాచలం, సత్యనారాయణ, పిల్లి గురువులు, యాద మ్ జగన్ , గ్రంధిరాము, యాదమ్ నర్సమ్మ, నర్రు సింహాచలం, కోలా రాములమ్మ, యాదమ్ పేరమ్మ, దొమ్మ లక్ష్మిలతోపాటు 200 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్యాహ్నపు బలరామ్, మంచెం మైబాబు,శ్రీనివాస్, మున్నులజాన్ గురునాద్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments