పోలీసులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

 

గుంటూరు ఆగస్టు 19 (globelmdianews.com - Swamy Naidu)
గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అనుచితవ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.నాని చౌదరి, లోకేష్ టీమ్ పేరుతో  సోషల్ మీడియాలో నాపై బెదిరింపు ధోరణితో పోస్టులు పెట్టారు.చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు చేశారు.
 పోలీసులకు ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు
మంగళగిరి నుంచి తరిమి కొడతామని హెచ్చరికలు కూడా వచ్చాయి.ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments:
Write comments