నారు.. బేజారు..(ఖమ్మం)

 

ఖమ్మం, ఆగస్టు 13 (globelmedianews.com - Swamy Naidu): జిల్లాలో ఖరీఫ్‌ సీˆజన్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. వరి నాట్లు మందకొడిగాసాగాయి.జిల్లాలో వర్షాలు పుంజుకోవడంతో వ్యవసాయ పనులు ముమ్మరం అయ్యాయి. వర్షాలతో భూగర్భ జలాలు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. మరో వైపు సాగర్‌ ఆశలు చిగురించాయి. మరో వారం రోజుల్లో సాగర్‌నీరు ఆయకట్టుకు తాకవచ్చని రైతులు అంచనా వేేస్తున్నారు. అయితే ఇప్పుడు సమస్యల్లా.. నారుదే. కాలం కలిసి వస్తున్నప్పటీకీ వరి నారు అందుబాటులో లేక రైతులు నారున్న చోటుకు పరుగులు తీస్తున్నారు. ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. పలువురు రైతులు తమకు కావాల్సిన వరి విత్తనం వ్యవసాయశాఖ నుంచి అందుబాటులో లేకపోవడంతో విత్తన కొనుగోలుకు దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో బావులు, బోర్లు, చెరువుల నీటి ఆధారంగా ప్రతీ ఏటా సుమారు 1,46,510 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుంటారు. 
 నారు.. బేజారు..(ఖమ్మం)
ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 39,520 ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేశారు. ఈ ఏడాది ఇప్పవరకు కేవలం 26.97శాతం మాత్రమే వరినాట్లు పూర్తయ్యాయి.సకాలంలో వర్షాలు కురవక... వరి నారు పెంపకం చేపట్టలేదు. కనీసం 25 నుంచి 30 రోజుల వయస్సు ఉన్న వరి నారును పొలంలో నాటు వేస్తుంటారు. కానీ, ఇప్పుడు నారు లభ్యత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగర్‌ ఆయకట్టులో పరిస్థితి మరింత దారుణం: సాగర్‌ ఆయకట్టులో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయకట్టు భూముల్లోనూ బావులు, బోర్లు ఉన్న రైతుల్లో కొంతమంది, కొంత విసీˆ్తర్ణానికి సరిపడా నారును పెంచుకొని అందుబాటులో ఉంచుకున్నారు. ఇప్పుడు సాగర్‌ జలాలపై ఆశలు చిగురించడంతో ఉరుకులు, పరుగులతో నార్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. రైతులు ఖరీఫ్‌లో ఇష్టంగా, ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేసే 5204 సన్న రకం సాంబమసూరి విత్తనం వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో లేకుండా పోయింది. దీంతో నారు ఉన్న రైతుల వద్దకు వెళ్లి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. క్షేత్రాల్లో దుక్కి చేసుకుంటూ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రయివేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

No comments:
Write comments