కొల్లేరు కు పూర్వవైభవం

 

ఏలూరు, ఆగష్టు 27  (globelmedianews.com)
ఆసియఖండంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన కొల్లేరు సరస్సుకు తిరిగి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  రేవు ముత్యాల రాజు వెల్లడించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం కొల్లేరు సరస్సును అభివృద్దిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సముద్రపునీరు, కలుషిత నీటితో వైభవంకోల్పేయిన కొల్లేరును రక్షించుకోవాల్సిన బాధత అందరిపై వుందని అన్నారు. దేశ విదేశాల నుండి వచ్చే వివిధ రకాల పక్షులకు నిలయంగా వుండే కొల్లేరుకు పూర్వవైభవం తీసుకువచ్చి పక్షులతోపాటు పర్యాటకులకు ఆహ్వానం పలికేలా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు. వర్గాకాలం లో మాత్రనే నీరు వుండి వేసవికాలంలో కళావిహీనంగా వుండకుండా నిత్యం మంచినీటితో కళకళలాడుతూ ఉండేవిధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 
కొల్లేరు కు పూర్వవైభవం

కొంతమంది అక్రమ చేపలు, రొయ్యల చెరువుల ఏర్పాటువల్ల కొల్లేరు కలుషితమైపోతోందని చెప్పారు. కొల్లేరు ప్రజల జీవనప్రమాణాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రకృతిసిద్దంగా ఏర్పడిన కొల్లేరు కాపాడుకునేందుకు ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ కొరారు. ఏలూరు పార్లమెంటు సభ్యులు  కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుతం కొల్లేరు సరస్సు ఒక సరర్సులా లేకుండాపోవడం చాలదురదృష్టకరమన్నారు. ఇరిగేషన్ అధికారులు, ఫారెస్టు కన్సర్వేటర్లు అంతాకలిసి కొల్లేరు సరస్సును కాపాడుకునేందుకు ఏమిచేస్తే బావుంటుందో ఒక నివేదిక తయారు చేయాలన్నారు. కొల్లేరు ప్రక్షాళనకు అవసరమైన రెగ్యులేటర్ చానల్స్ సంబంధించి డ్రాయింగ్స్, టెక్నికల్ వివరాలు, అంచనాలు రూపొందించి రెండు నెలల్లోగా అందచేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నవంబర్ నెలలో మళ్లీ ఒక సమావేశం ఏర్పాటుచేసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులమంతా ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్రెడ్ది దృష్టికి తీసుకువెళ్లి ప్రతిపాదనలను శాంక్షన్ చేయించి రెండు సంవత్సరాలలోగా కొల్లేరు సరస్సును కాపాడుకునేందుకు అవసరమైన చర్యలన్నీ పూర్తిచేస్తామన్నారు. పెడన నియోజకవర్గంలో ఒక చానల్ ద్వారా సముద్రపునీరు సుమారు 30 కి .మీ చొచ్చుకుని రావడం వల్ల ఒక లక్ష ఎకరాల వరకు నష్టం వాటిల్లుతోందని అక్కడ కూడా ఒక ఫిజికల్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సి వుందని చెప్పారు. కొల్లేరులో నిత్యం మంచినీరు నిల్వవుండి ఆనీటిని అవసరంమేర వాడుకునేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కొల్లేరు ప్రాంతంలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా ఆయా ప్రాంతాలలో 10 నుండి 20 ఎకరాలలో మంచినీటి చెరువులు తవ్వుకునేందుకు ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతులు తీసుకురావడం జరుగుతుందని , కొల్లేరుపై ఆధారపడి అనాధిగా జీవించేవారిని కూడా దృష్టిలోపెట్టుకుని కొల్లేరును రక్షించుకుంటామని ఎంపి చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్  ఎం వేణుగోపాల్ రెడ్ది, డిఆర్ఒ  ప్రభాకరరావు, శాసనసభ్యులు  కొఠారు అబ్బయచౌదరి,  గ్రంధి శ్రీనివాస్,  మంతెన రామరాజు,  జోగి రమేష్,  దూలం నాగేశ్వరరావు, ఎంఎల్సి  మంతెన వెంకట సత్యనారాయణరాజు (పాండువ), ఆర్ కెఆర్ ఇంజనీరింగ్ కాలేజి ప్రొఫెసర్  పిఎ రామకృష్ణరాజు, ఇరిగేషన్ ఎస్ఇ  కెఎస్ ప్రకాశరావు, కైకలూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్  బి .విజయ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments