హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ముమ్మాటికీ కుట్రే... మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌

 

గుంటూరు ఆగష్టు 16  (globelmedianews.com - Swamy Naidu):
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కి పూర్తి భద్రత కల్పిస్తున్నామని నిన్నగాక మొన్న హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం  ఇప్పుడు చట్ట విరుద్ధంగా డ్రోన్‌ వినియోగించడం ప్రభుత్వ కుట్ర వైఖరికి నిదర్శనమని మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నివాసం నుంచి కిరణ్‌ అనే వ్యక్తి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు నివాసం వద్ద డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టామని పట్టుబడిన ప్రైవేట్‌ వ్యక్తులు చెబుతుంటే..ప్రభుత్వం కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందనడానికి ఇంత కంటే సాక్ష్యం ఇంకేం కావాలని ప్రశ్నించారు. కానివైసీపీ నేతలు మాత్రం దాన్ని మసిపూసి మారేడు చేసే విధంగా ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో చేశామని కట్టుకథలు చెబుతున్నారు. 
హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా ముమ్మాటికీ కుట్రే...
మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌
హైసెక్యూరిటీ జోన్‌లో డ్రోన్‌ కెమెరాలు ఉపయోగించరాదని డ్రోన్‌ పాలసీలో స్పష్టంగా ఉన్నప్పటికీ.. అధికారం అండతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా నడుచుకంటున్నారని విమర్శించారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ప్రతిపక్ష నాయకుడి భద్రతను ప్రశ్నార్ధకం చేసేలా వ్యవహరించిన ప్రభుత్వం సామాన్యులకు ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది.? గతంలో చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉండగా ప్రజావేదికను నేల మట్టం చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ వెళ్లిన సమయంలో డ్రోన్ల కుట్రకు పాల్పడ్డారు. సి.ఎం. నివాసంలోని కిరణ్‌ అనే వ్యక్తి పంపిన ప్రైవేట్‌ వ్యక్తులను కాపాడటానికి పోలీసులు టీడీపీ నాయకులపై లాఠీ చార్జ్‌ చేశారు. డ్రోన్ల కుట్రలను కప్పి పెట్టుకోవడానికి ఇరిగేషన్‌ శాఖను తెరపైకి తెచ్చారు. ఇరిగేషన్‌ శాఖ ఎస్‌.సీ నుంచి అనుమతి పత్రం తీసుకోకుండా డ్రోన్‌ ఎలా పంపిస్తుంది? అనుమతి పత్రాలు ఉంటే మీడియాకు ఎందుకు చూపలేదు? హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న ప్రతిపక్ష నాయకుని ఇంటి వద్ద ఆళ్ల రామకృష్ణారెడ్డి నిన్న రెక్కీ నిర్వహించారు. ప్రతిపక్ష నాయకుని ఇంటి వద్దకు అనుమతి లేకుండా వైసీపీ శాసనసభ్యులు రావడం కుట్ర కాదా? అని అన్నారు.ప్రతిపక్ష నాయకునిపై కక్షతో రాజధాని గ్రామాల ప్రజలను ముంచుతారా? ప్రతిపక్ష నేత ఇంటిపైనే రెక్కీ నిర్వహిస్తారా? ప్రకాశం బ్యారేజీ క్రింద ఉన్న కాలనీలు, గ్రామాలను ముంచడం అరకొర సహాయ చర్యలు ప్రభుత్వ వైఫల్యం కాదా? రెండు వారాల నుండి వరద వస్తుంటే ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ముందుగానే శ్రీశైలం నుండి ప్రకాశం బ్యారేజీ వరకు తగు మోతాదులో నీరు విడుదల చేయలేదు? ఆలస్యంగా గేట్లు తెరవడం కుట్రలో భాగం కాదా? ఇప్పుడు వచ్చిన వరద కన్నా ఎక్కువ వరద వచ్చినప్పుడు కూడా ఏమీ కాని చోట ఇప్పుడెందుకు ఇలా అయ్యింది. ఇందా వైసీపీ నేతల కుట్రలో భాగం కాదా అన్నారు. దీని ఫై డిజిపి వెంటనే స్పందించి ప్రైవేట్‌ వ్యక్తులు, హరిని పంపిన సీ.ఎం. నివాసంలోని కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. తీవ్రమైన ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ప్రభుత్వం కుట్రలు, దుష్ప్రచారాలు మాని వరద బాధికులకు రక్షణ కల్పించాలి. సహాయ కార్యక్రమాలు చేపట్టాలని,. లాఠీచార్జీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కె.ఎస్‌.జవహర్‌డిమాండ్ చేసారు.

No comments:
Write comments