స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

 

విజయవాడ, ఆగస్టు 3, (globelmedianews.com - Swamy  Naidu)
తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తారన్న పేరుంది. అంతేకాదు శాంతిభద్రతల విషయంలో ఎంతటి వారినైనా వదలిలపెట్టరన్న ట్రాక్ రికార్డు ఉంది. ఆయనే స్టీఫెన్ రవీంద్ర. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే స్టీఫెన్ రవీంద్ర పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నానుతోంది. ఇప్పుడు స్టీఫెన్ రవీంద్రకు కేంద్ర ప్రభుత్వం నుంచి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర బాధ్యతలను చేపట్టనున్నారు.ఏ ప్రభుత్వానికి అయినా ఇంటలిజెన్స్ శాఖ గుండెకాయ వంటిది. అందులో ఇంటలిజెన్స్ చీఫ్ అంటే అనుభవంతో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకునే తత్వం అవసరం. ప్రభుత్వంపై పెరుగుతున్న అసమ్మతితో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ శాఖ ప్రభుత్వానికి అందచేస్తుంది. 


 స్టీఫెన్ రవీంద్రకు లైన్ క్లియర్

ఇక ఇంటలిజెన్స్ చీఫ్ అంటే ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా కూడా ఉంటారు. ఇప్పడు జగన్ ఏరికోరి ఆంధ్రప్రదేశ్ కు స్టీఫెన్ రవీంద్రను ఇంటలిజెన్స్ చీఫ్ గా తీసుకువస్తున్నారు.హైదరాబాద్ రేంజ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర పనిచేస్తున్నారు. స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టీఫెన్ రవీంద్రకు నిజాయితీపరుడన్న పేరుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు. 1999లో తొలిసారి వరంగల్ ఏఎస్పీగా పనిచేశఆరు. తర్వాత 2004లో ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. ముఖ్యంగా మావోయిస్టులను ఏరివేయడంలో దిట్టగా పేరుంది. 2009లో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. 2010లో వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. 2012 లో గ్రౌహౌండ్స్ గ్రూపు కమాండ్ గా బాధ్యతలను చేపట్టిన స్వీఫెన్ రవీంద్ర పదోన్నతిపై డీఐజీగా సైబరాబాద్ జాయింట్ కమిషనర్ గా పనిచేశారు. తర్వాత ఐజీగా పదోన్నతిని పొందారు.దీంతోనే వైఎస్ జగన్ స్టీఫెన్ రవీంద్రను ఏరికోరి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు తెచ్చుకున్నారు. వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను చక్కదిద్దాలని భావిస్తున్నారు. దీంతో పాటుగా కేవలం రాజకీయ సమాచారం మాత్రమే కాకుండా మావోయిస్టుల ఏరివేతలో కూడా స్టీఫెన్ రవీంద్ర సేవలను ఉపయోగించుకోవాలన్నది జగన్ ఆలోచన. అందుకోసమే ఆయన స్టీఫెన్ రవీంద్రను ఎంపిక చేసుకున్నారు. మరి జగన్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా స్టీఫెన్ రవీంద్ర పనిచేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

No comments:
Write comments