పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించిన సోనియాగాంధీ

 

న్యూఢిల్లీ ఆగష్టు 16 (globelmedianews.com - Swamy Naidu):
వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విభాగాల ప్రక్షాళనకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నడుం బిగించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ కొత్త చీఫ్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే మహారాష్ట్రకు చెందిన పార్టీ నేతలు శుక్రవారంనాడు సోనియాగాంధీతో సమావేశమయమయారు. రాష్ట్ర విభాగాల ప్రక్షాళనను సోనియా చేపట్టే అవకాశాలున్నట్టు సమావేశానంతరం ఆ పార్టీ నేతలు తెలిపారు.జార్ఖాండ్, కర్ణాటక, గోవాలకు పార్టీ కొత్త అధ్యక్షులను సోనియాగాంధీ త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 
 పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించిన సోనియాగాంధీ 
హర్యానాలో అంతర్గత పోరాటాలు ఎక్కువగా ఉండటాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఆ వర్గాల మధ్య సద్దుబాట్లకు కొన్ని పరిష్కారాలు సూచించిందని, కర్ణాటక, గోవాల్లో ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటం పైనా కాంగ్రెస్ అధినాయకత్వం ఆందోళనం వ్యక్తం చేసిందని సమాచారం.కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సోనియాగాంధీ, ఈ ఏడాది చివర్లో పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున పార్టీ సన్నాహాలపై సమీక్షా సమావేశాలు జరుపుతున్నారు. గత బుధవారంనాడు జార్ఖాండ్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హర్యానా, మహారాష్ట్ర ఇన్‌చార్జీలతో కూడా సోనియా త్వరలోనే సమావేశమవుతారని తెలుస్తోంది.

No comments:
Write comments