జమ్మూ ప్రశాంతం

 

శ్రీనగర్ ప్రశాంతం, ఆగస్టు,12  (globelmedianews.com - Swamy Naidu)
జమ్ము కాశ్మీర్లో పోలీసులు విధించిన ఆంక్షలతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఈద్ను భద్రతాదళాల పహారాల మధ్యల జరుపుకున్నారు.  హింసాకాండ చెలరేగే అవకాశం ఉందనే భయంతో తిరిగి ఆంక్షలను విధించడంతో శ్రీనగర్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అనేక మసీదుల్లోకి ప్రజలను అనుమతించలేదు. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా తదితరులను సమీపంలోని మసీదుల్లో నమాజ్ చేసుకునేందుకు అనుమతించినట్లు అధికారులు చెప్పారు. 
 జమ్మూ ప్రశాంతం
పెద్ద ఎత్తున జనాలు గుమ్మిగుడాన్ని కుడా పోలీసులు నివారించారు. మొత్తానికి బక్రిద్ ప్రార్ధనలు ప్రశాంతంగా ముగిసాయని ఆ రాష్ట్ర పోలీసులు ప్రకటించారు. అనంతనాగ్, బాలముల్లా, బుద్గావ్, బండీపోర్ నగరాల్లో ప్రార్ధనలు ప్రశాంతంగా కొనసాగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  శనివారంనాడు ఆంక్షలను ఎత్తివేసిన తరువాత శ్రీనగర్లో చెదురుమదురు సంఘటనలు జరిగాయని ప్రభుత్వం పేర్కొంది. కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు లాంటి నిత్యావసరాలను వాహానాల ద్వారా పంపిణి చేసారు. 

No comments:
Write comments