ప్రైవేట్ పార్ట్స్ లో పవన్ టాటు అషురెడ్డికి బిగ్ బాస్ కలిసొస్తుందా

 

విశాఖపట్టణం, ఆగస్టు 3, (globelmedianews.com)
నిన్న మొన్నటి వరకూ ఆమె జూనియర్ సమంత.. డబ్ స్మాష్ స్టార్.. సోషల్ మీడియా సంచలనం.. కాని నేడు బిగ్ బాస్ కంటెస్టెంట్. హౌస్‌లో గ్లామర్ బ్యూటీ. ఆమె ఎవరో కాదు విశాఖ చిన్నది అషు రెడ్డి. బిగ్ బాస్ సీజన్‌లో సడెన్ ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచింది అషు రెడ్డి. ఆమె బిగ్ బాస్‌కి రావడం ఆశ్చర్యం కాదు.. ఆమె రూపమే ఆశ్చర్యం అంటున్నారు ఆమె ఫాలోవర్స్. సోషల్ మీడియ ద్వారా జూనియర్ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి.. బొద్దుగుమ్మగా మారి బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. నాజూకు సుందరిగా జూనియర్ సమంతగా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపిన అషు.. బిగ్ బాస్‌కి వచ్చే సరికి జూనియర్ నమితలా మారడంతో ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ వచ్చాయి. ఇన్నాళ్లు ఎప్పటివో పాత ఫొటోలు షేర్ చేసి.. మమ్మల్ని ఛీట్ చేస్తావా? అంటూ అంతెత్తున్న లేచారు. కొందరైతే మా అషు.. బొద్దుగున్నా అందమే అంటూ మద్దతు తెలిపారు. ఆ మద్దతు తెలిపిన వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం విశేషం.
ప్రైవేట్ పార్ట్స్ లో పవన్ టాటు  అషురెడ్డికి బిగ్ బాస్ కలిసొస్తుందా

అదేంటి పవన్ ఫ్యాన్స్ ఆమెకు మద్దతు తెలపడం ఏంటి? అనుకుంటే దాని వెనుకు పెద్ద కథే ఉంది. ఆమె జనసేన పార్టీలో సభ్యురాలూ కాదు.. పవన్‌తో కలిసి సినిమాలోనూ చేయలేదు కాని.. అంతకంటే పవన్ ఫ్యాన్స్‌తో అభిమానించబడే పని అప్పట్లో చేసి భారీగా మద్దతు కూడగట్టింది. దీనికి కారణం ఆమె పవన్‌కు వీరాభిమాని. ఎంతలా అంటే పవన్ పేరును ఆమె ప్రైవేట్ పార్ట్‌పై పచ్చబొట్టు వేసుకునేంతగా.. అవును!! 2018 మార్చిలో పవన్ ఫ్యాన్స్‌కి మూవీ క్రిటిక్ మహేష్ కత్తికి మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఆ సమయంలో పవన్‌కి వీరాభిమాని అయిన అషు రెడ్డి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్‌కి ఎవరెవరితోనో ఎఫైర్‌లు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారని.. అంతెందుకు ఆయనకు నేను కూడా పిచ్చి ఫ్యాన్‌ని. కావాలంటే చూస్కోండి అంటూ తన ఎదపై వేసుకున్న పవన్ పచ్చ బొట్టును విప్పి చూపించింది. ‘ నేను పవన్ టాటూ వేయించుకున్నా.. అంటే దానర్థం నాకు ఆయనకు ఎఫైర్ ఉన్నట్లా..? జవాబు చెప్పండి’ అంటూ కత్తి మహేశ్‌కు సవాల్ విసిరింది. అప్పట్లో ‘అషు ఎదపై పవన్ టాటూ’ అనే వార్త సోషల్ మీడియాలో పెద్ద సంచలనం రేపింది. అయితే ఇప్పుడు సడెన్‌గా పవన్ వీరాభిమాని అషు రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ మద్దతుని కూడగట్టింది. అపుడెపుడో 2018 జనవరిలో అషు రెడ్డి విప్పిన ఈ పచ్చబొట్టు గుట్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక్కసారి ఆమె ట్విట్టర్ ఖాతాలోకి వెళితో పవన్ అంటే ఎంతో భక్తో.. ప్రేమో.. పిచ్చో.. ఇట్టే అర్ధమైపోతుంది. ఇంతటి భక్తురాలుకి పవన్ ఫ్యాన్స్ మద్దతు లేకుండా పోతుందా? అషుకి ఓట్లు గుద్దడం మొదలు పెడితే మాకంటే బాగా గుద్దేవాడు ఎవడూ ఉండడు అంటూ ఆమెకు ఓట్లు కురిపిస్తున్నారట పవన్ ఫ్యాన్స్. అయితే బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివ బాలాజీ కూడా పవన్ ఫ్యాన్స్ మద్దతుతో గెలిచారనే టాక్ బలంగానే ఉంది. ఈసారి అషు రెడ్డితో అది రిపీట్ చేస్తారేమో చూడాలి.

No comments:
Write comments