గిరిజన సమస్యలపై దృష్టి

 

కర్నూలు, ఆగస్టు 09,(globelmedianews.com - Swamy Naidu):
గిరిజన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేటు లోని సునయన ఆడిటోరియంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవంలో ఆయన ముఖ్య అతిధి  గా పాల్గొన్నారు.  కర్నూలు పార్లమెంటు సభ్యులు డా.సంజీవ కుమార్ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్, వివిధ గిరిజన సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  గిరిజన నాయకులు చెప్పిన సమస్యలన్ని నోట్ చేసుకున్నామని క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరంగా క్రమపద్దతిలో సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని స్పష్టం చేసారు. ప్రతి మూడు మాసాల కొకసారి జిల్లా విజిలెన్స్ మానిటరింగు సమావేశం, జిల్లా స్థాయి స్కూనిటి కమిటి సమావేశాన్ని ఏర్పాటు చేసి అదో రోజు గిరిజన సమస్యలను కూడ పరిష్కరిస్తామని కలెక్టరు తెలిపారు
 గిరిజన సమస్యలపై దృష్టి
పాలసీ విధానాలు మినహ తమ పరిధిలోని సమస్యలన్నింటిని నిశితంగా పరిశీలించేందుకు కృషి చేస్తామన్నారు. సాంఘీక సంక్షేమం, గిరిజన సంక్షేమం తదితర శాఖల్లో బాక్ లాగ్ పోస్టులన్నింటిని భర్తి చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. అందరూ సమస్యల మధ్య పుట్టి, సమస్యల మధ్యనే పెరిగామని ప్రతి వర్షంలోను సమస్యలు వున్నాయని న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. చదువు ఒక్కటే సమస్యల నుండి బయటకు తీసుకవస్తుందని ప్రతి ఒక్కరూ ఉన్నతంగా చదువుకోడానికి ఉత్సాహం చూపాలని ఆయన అన్నారు. గిరిజనుల్లో అధిక మంది దురలవాట్లకులో నై కుటుంబాన్ని విచ్చిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బయటపడేందుకు ప్రయత్నించాలని  ఆయన ఈ సందర్భంగా కోరారు. కర్నూలు పార్టమెంటు సభ్యులు డా.సంజీవ కుమార్ మాట్లాడుతూ భూమిపై మొదలగా ఆవిర్భవించింది ఆదివాసులేని ఆదివాసుల సమస్యలను పరిష్కరించేందుకు తాను వెన్నంటి వుంటానని హామీ ఇచ్చారు. 1982 లో ఐక్యరాజ్య సమితి ఆదివాసుల సమస్యలపై చర్చ పెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తేదిన ఆదివాసుల దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రపంచంలోని 6,500 కోట్ల బాషల్లో 3,500 బాషలు ఆదివాసులకు చెందినవేనన్నారు. ప్రపంచంలో 750 కోట్ల జనాభాలో 39  కోట్ల ఆదివాసులేనని మన రాష్ట్ర్టంలో 38 లక్షల మంది ఆదివాసులువున్నారని వారి హక్కుల కోసం తాను కూడా పోరాటం చేస్తానని అన్నారు. నందికొట్కూరు ఎమ్యెల్యే ఆర్ధర్ మాట్లాడుతూ డా.సాహెబ్ అంబేద్కరు రిషర్వేషన్ ఫలితంగానే తాను ఈ రోజు  ఈపదవిలో వుండే అవకాశం కలిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ట్రైబల్ ఫెడరేషన్ స్టూడెంట్ అధ్యక్షులు చంద్రప్ప, ఆలిండియా బంజారా సేవా సంఘ సెక్రటరీ వెంకటరమణ, షెడ్యూల్డ్ ట్రైబల్ ఫెడరేషన్ సెక్రటరీ యోగేష్ నాయక్, ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు రాజు, సుగాలి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు శంకర్ నారాయణ, వివిధ గిరిజన సంఘాల నాయకులు, జీవుల నాయక్, నారాయణమ్మ, నరసింహనాయక్, చిటికెల సలోమి, మద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  జేసి-2 ఖాజా మొహిద్దీన్, వ్యవసాయ శాఖ జెడి ఠాగూరు నాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మురళిధరరావు, తదితర జిల్లా అధికారులు, పాఠశాల విద్యార్ధులు పాల్గొన్నారు.  

No comments:
Write comments