తుంగభద్రలో భారీగా వరద నీరు

 

కర్నూలు ఆగస్టు,12  (globelmedianews.com - Swamy Naidu)
తుంగభద్రా నదికి బారీగా వరద నీరు చేరింది.  మంత్రాలయం దగ్గర భారీగా వరద నీరు వచ్చింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరికలు జారీ చేసారు. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులు నదిలో స్నానానికి వెళ్ళకూడదు అని ఆంక్షలు విధించారు.  తుంగభద్రా నది తీరాన పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసారు. కర్ణాటక తుంగభద్ర డ్యాం నుండి  2,26000 ,క్యూసెక్కుల నీటిని విడుదల అయినట్లు సమాచారం. నదీ తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు రెవెన్యూ అధికారులు  హెచ్చరించారు. ప్రమాదం ఏమీ లేదని  అధికారులు తెలిపారు.  అయినా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. 
 తుంగభద్రలో భారీగా వరద నీరు
మంత్రాలయం దగ్గర నీటి ప్రవాహాన్ని శ్రీమఠం  మేనేజర్ ఎస్ కే శ్రీనివాసరావు,  మంత్రాలయం తాసిల్దార్ చంద్రశేఖర్, విఆర్ ఓ భీమన్న గౌడు ఇతర సిబ్బంది పోమవారం పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల తుంగభద్రా నదికి నీరు విడుదల కావడంతో నది తీర గ్రామాల ప్రజలు భయాందోళనలో వున్నారు.  2009 వరదలు పునరావృతం అవుతాయా  లేక ఇంతటితోనే ఆగిపోతాయా అని అందోళనలో వున్నారు.  2009లో కర్నూలులోని తుంగభద్ర పరివహక ప్రాంతలు,  మంత్రాలయంలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. సరిగ్గా పది సంవత్సరాల తర్వాత 2019 వ సంవత్సరం లో మళ్ళీ  వరద నీరు రాక అందోళన కలిగిస్తోంది. మరోవైపు, రెండు రోజుల్లో రాఘవేంద్ర స్వామి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. స్వామి  ఆరాధనకు  లక్షలాది మంది భక్తులు వస్తారు. అంత మంది ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అనుక్షణం మదనపడుతున్నారు. అయితే రెండు రోజుల్లో వరద నీరు తగ్గిపోతుందని పోలీసు, రెవెన్యూ అధికారులు అంచన వేస్తున్నారు. 


No comments:
Write comments