రాజకీయ ద్వందనీతికి అద్దం పడుతున్న నడ్డా మాటలు నడ్డా..లక్షన్ లకు కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టె దమ్ముందా? ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్

 

హైదరాబద్ ఆగష్టు 19   (globelmedianews.com - Swamy Naidu)
బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డ మాటలు రాజకీయ ద్వందనీతికి అద్దం పడుతున్నాయని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు.బీజేపీ ద్వంద రాజకీయాలు మనుకోకపోతే తెలంగాణ ప్రజలు నడ్డీ విరుస్తారని నడ్డాకు తెలియక పోయిన ..లక్షన్ కు తెలియదాఅని ప్రశ్నించారు.సోమవారం గాంధి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలపై ఏనాడు టీఆర్ఎస్ బీజేపీ సర్కార్ ను ప్రశ్నించలేదన్నారు.అలాగే రాష్ట్ర సర్కారు లో జరుగుతున్న అవినీతిపై .. తప్పులపై ఏనాడు కేంద్రంలోని బీజేపీ స్పందించలేదన్నారు.జేపీ నడ్డా కేసీఆర్ సర్కార్ పై చేసిన ఆరోపణలన్నీ..కాంగ్రెస్ చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నావేనని ఈ సందర్బంగా సంపత్ గుర్తు చేసారు.కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఇన్నిరోజులు కళ్ళు ముసుకున్నారన్నారు.

రాజకీయ ద్వందనీతికి అద్దం పడుతున్న నడ్డా మాటలు
నడ్డా..లక్షన్ లకు కేసీఆర్ సర్కార్ కేసులు పెట్టె దమ్ముందా? 
ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్
అవినీతి నిరోధక వ్యవస్థలన్నీ కేంద్రంలో మీ చేతిలోనే ఉన్నప్పటికి చర్యలు తీసుకోకుండా ఇన్నిరోజులు ఎవరి సంకనాకారని ప్రశ్నించారు.నడ్డా .. లక్షన్ లు చేసిన విమర్శలపై కేసీఆర్ సర్కార్ కేసులు పెడుతుందా అని ప్రశ్నించారు.సోషల్ మీడియాలో విమర్శలు చేసే సామాన్యులపై కేసులు పెట్టే రాష్ట్ర ప్రభుత్వం .. చేతనైతే నడ్డాపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు.కేసీఆర్ పథకాలన్నీ మహా అద్భుతంగా ఉన్నాయని మీ కేంద్ర మంత్రులు గతంలో చెప్పలేదా అన్నారు.మిషన్ భగీతర పథకాన్ని మోడీ కదా శంకుస్థాపన చేసిందన్నారు.బీజేపీలో చేరుతున్నదంతా రాజకీయ చెత్తనే..ఎందుకు పనికిరానివారికి..జాతీయ నాయకులను పిలిచిమరీ కండువాలు కప్పుతున్నారు..అమిత్ షా ఓ ఖునీ కోరని ..ఆయన రాజకీయలన్నీ రక్తపు మరకలేనని ఆరోపించారు.సోనియా పై విమర్శలు చేసే ముందు లక్ష్మణ్ వారి నాయకుడి చరిత్ర తెలుసుకోవాలని సంపత్ హితవు పలికారు.కేసీఆర్ అవినీతిపై బీజేపీ సర్కార్ తక్షణ చర్యలు తీసుకోవాలని,బీజేపీ ఆరోపణలు తప్పు అయితే .. వాటిపై వెంటనే కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు.లేకుంటే మీవన్నీ నాటకాలేనని మరోసారి రుజువు అవుతుందన్నారు.కేసీఆర్ క్యాబినెట్ లో ఉన్నదంతా చేతగాని దద్దమ్మలేనని సంపత్ ఎద్దేవా చేసారు.

No comments:
Write comments