ప్రైవేట్ వాహానాల జోరు... ఆర్టీసీ బేజారు

 

అదిలాబాద్, ఆగస్టు 14, (globelmedianews.com - Swamy Naidu)
సిరికొండకు రావాలన్న, పోవాలన్న ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొవలసిందే. సమయానికి బస్సురాదు. ఏ సమయానికి బస్సువస్తుందో, ఎప్పుడు రద్దవుతుందో తెలియని పరిస్థితి. ప్రైవేటు వద్దు ఆర్టీసి ముద్దు, ఆర్టీసి ప్రయాణమే సుఖమైన ప్రయాణం అని గొప్పలు చెప్పుకుంటున్న ఆర్టీసి ఆధికారులు ఆదిశలో ప్రయాణికులలో నమ్మకం కలిగించ లేక పోతున్నారు. ఆస్టీసి ప్రయాణమంటే ఇంత అద్వాన్నమా అని అనిపించుకుంటున్నారు. ప్రయాణికులను ఏమాత్రం ఆకట్టుకోలేక పోతున్నారు. ప్రైవేటు ముద్దు ఆర్టీసీ వద్దు అనే రితీలో వ్యవహరిస్తున్నారు. ఆర్టీసి బస్సులపై విశ్వాసం, నమ్మకం కోల్పోతూ ప్రయాణికులు ప్రైవేటు వహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు వహనాల్లో ఎలాంటి వసతులు లేకున్నా, కనీసం కూర్చోడానికి స్థలం లేకున్నా టాపులపై కూర్చోని, పక్కన, వెనుక వేలాడుతు అపాయమని తెలిసినా అష్టకష్టాలకు ఓ ర్చుకొని ప్రయాణం చేస్తున్నారు. 
 ప్రైవేట్ వాహానాల జోరు... ఆర్టీసీ బేజారు
సిరికొండ పట్ల ఆర్టీసి అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రయాణీకుల కష్టాలపై మన తెలంగాణ ప్రత్యేక కథనం ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల మధ్యన సిరికొండ ఉంది. ఈ రెండు మండలాలకు చెందిన మారుమూల గ్రామాలను సిరికొండను ప్రత్యేక మండల కేం ద్రం చేశారు.దాదాపు 56పై చిలుకు గ్రామాలను ఈ మండ ల కేంద్రానికి అనుబంధం చేశారు. దాదాపు మండలంలో 17 వేల నుంచి 20 వేల జనాభా నివశిస్తున్నారు. ఇచ్చోడ నుంచి సిరికొండ 15 కిలో మీటర్లు, ఇంద్రవెల్లి నుంచి సిరికొండ 16 కిలో మీటర్ల దూర పరిధి ఉంటుంది. కొత్తగా ఏర్పడిన సిరికొండకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడంలో అధికారులు, పాలకులు పూర్తిగా విపలమయ్యారు. ఇచ్చోడ నుంచి సిరికొండ, సిరికొండ నుంచి ఇంద్రవెల్లి మండలాలకు వెళ్లేందుకు ప్రతీ రోజు వందలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కాని వీరికి సక్రమమైన బస్సు సౌకర్యం లేక ప్రతి రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలం ఏర్పాటు కంటే ముందు సిరికొండకు ఒక ప్రత్యేక బస్సును నడిపిన ఆర్టీసి అధికారులు మండలం ఏర్పడిన అనంతరం ప్రత్యేక బస్సును రద్దు చేశారు.మండలం ఏర్పడిన అనంతరం ప్రత్యేక బస్సును రద్దు చేశారు. ఆదిలాబాద్ నుంచి నేరుగా ఇచ్చోడ, బజార్‌హత్నర్ మీదుగా సొనాల వరకు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక బస్సును ఇచ్చోడ నుంచి సిరికొండకు ఉదయం రెండు ట్రిప్పులు సాయంత్రం ఒక ట్రిప్పులకు పరిమితం చేస్తూ నడుపుతున్నారు,. ప్రతీ రోజు కేవలం 3 ట్రిప్పులకే పరిమితం చేసిన అధికారులు ఆట్రిప్పులకు కూడా ప్రయాణికులను ఆకట్టుకోలేక పోతున్నారు. ఆ మూడు ట్రిప్పులు కూడా సక్రమంగా నడుపకపోవడం వల్ల ప్రయాణికుల్లో అసహానం వ్యక్తం అవుతుంది. బస్సు వేలల సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా బస్సును న డుపుతున్నారు. ప్రభుత్వ సెలవుల రోజైతే పూర్తిగానే రద్దు చే స్తున్నారు. సెలవులు, పండుగల రోజులల్లోనే ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు.కాని ఆర్టీ సి అధికారులు ప్రభుత్వ సెలవుల రోజుల లో బస్సును సైతం నిలిపివేస్తున్నారు. సిరికొండ మండలంలో అనేక మారుమూల గ్రామాలు రోడ్డు సౌకర్యానికి నోచుకోలేని వే ఉన్నాయి. ఆర్టీసి బస్సును సరిఅయిన సమయానికి నడుపకపోవడం, ప్రభుత్వ సెలవులలో నిలిపి వేయడం వల్ల ఆర్టీసీ బస్సుపై నమ్మకం పోగోట్టుకొని ప్రయాణికులు ప్రైవేటు వహనాలను ఆశ్రయిస్తున్నారు. ఆటోలు, జీపులు పెరిగి పోయా యి. ఇచ్చోడ నుంచి సరికొండకు ఇంద్రవెల్లి నుంచి సిరికొండకు ప్రతి రోజు వందలాది ఆటోలు జీపులు నడుస్తున్నాయి. ఈ ఆటోలు, జీపులలో పరిమితిని మించి ప్ర యాణీకులను తీసుకెళ్తున్నారు. ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. అధికూడా బస్సు లో కేవలం 11 రూపాయల టీకెట్లు మా త్రమే ఉండగా ప్రైవేటు వహనాల్లో 15 నుంచి 20 రూపాయ ల వరకు ఒక్కొ ప్రయాణికుని వద్ద ముక్కుపిం డి వసూలు చేస్తున్నారు.అయినప్పటికి ప్రయాణికులు ప్రైవే టు వహనాల్లోనే అధికంగా ప్రయాణిస్తున్నారు. బస్సు లో ప్ర యాణించలేక పోతున్నారు. బస్సులలో ప్రయాణించక పోవడానికి ప్రధాన కారణం సమయపాలన పాటించకపోవడం, నిలిపి వేయడమేనని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల్లో నమ్మకం కలిగే విధంగా సిరికొండకు ఒక ప్రత్యేక బస్సును ప్రతి రోజు సమయపాలన పాటించే విధంగా నడుపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

No comments:
Write comments