ప్రజలకు అందుబాటులో వుండండి

 

ఒంగోలు, ఆగస్టు 16, (globelmedianews.com - Swamy Naidu):
జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అదికారులను ఆదేశించారు. శుక్రవారం పొదిలి మండల కేంద్రంలోని విశ్వనాధ పురం లోని ఖాదర్ వలి  కళ్యాణ మండపంలో కందుకూరు, మార్కాపురం రెవిన్యూ డివిజనల్ మండల ప్రత్యేక అధికారులతో  ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు చేరువ చేయడానికి తీసుకోవలసిన చర్యల పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు దగ్గరికి తీసుకుపోవడానికి గ్రామ, వార్డు  వాలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడానికి భవనాలను సిద్ధం  చేయాలని పంచాయతీ రాజ్ ఇంజనీర్ల ను ఆయన ఆదేశించారు. జిల్లాలో సాగర్ కాలువల ద్వారా వచ్చె నీటిని చెరువులకు, త్రాగునీటి  పధకాలకు నింపుకోవాలన్నారు. అవకాశం ఉండి కూడా చెరువులను సాగర్ నీటితో నింపుకోకపోతే  సంబంధిత  అదికారుల పై చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు. జిల్లాలో పని చేయని త్రాగునీటి పథకాలను పరిశీలించి మరమ్మతులకు అవసరమైన ప్రతిపాదనలు ఈ నెల 26 వ తేదిలోగా  తెలియజేయాలన్నారు. 
ప్రజలకు అందుబాటులో వుండండి
జిల్లాలో కావలసిన మేర నీటి నిల్వలు ఉన్నప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటి సరపరా చేయడం మంచి పద్దతి కాదని కాయన స్పష్టం చేశారు. మండల స్ధాయిలో ఉన్న త్రాగు నీటి పదకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. పంచాయితీ కార్యదర్శిలు గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదని పద్దతిలో మార్పు రాకపోతే క్రమశిక్షణ  చర్యులు తీసుకుంటామని ఆయన చెప్పారు.   జిల్లాలో గ్రామ పంచాయితీలలోని ప్రధాన రహదారిపై   ఉన్న షాపింగ్ మార్కెట్ వద్ద   చెత్త చెదారం పడడవేయకుండా ఎంపీడీఓలు, ని.ఓ.పి.ఆర్.డి లు చర్యలు తీసుకోవాలని ఆయన చెపారు.  గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా  ముదస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అదికారులను ఆదేశించారు.  గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలు ఉండకుండా చర్యలు  తీసుకోవాలని ఆయన  అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి  అధికారులు వాలంటీర్లకు పూర్తి స్థాయిలో అన్ని విషయాల  పై అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు. జిల్లాల్లో  ఇంటి నివేశ  పట్టాల పంపిణి, అమ్మఒడి, వై.ఎస్.ఆర్. చేయూత అర్హుల జాబితాలను ప్రజల నుంచి సేకరించాలన్నారు. జిల్లాలో అర్ములైన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీ చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన కార్యక్రమాన్ని ప్రాధాన్యత అంశముగా తీసుకున్నారన్నారు. జిల్లాలో ప్రజల నండి స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను వేగంగా పరిష్కరించాలన్నారు. మండల స్థాయిలో పనిచేసే అధికారులు పారదర్శకంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు మండల స్థాయిలో అన్ని గ్రామాల్లో మొక్కలు నాటాలన్నారు. అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధిక శాతం లో మొక్కలు నాటలని ఆయన తెలిపారు.  ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.షన్ మోహన్, కందుకూరు ఆర్.డి.ఓబులేసు, మార్కాపురం ఆర్.డిఓ శేషి రెడ్డి గ్రామీణ నీటిసరఫరా శాఖ ఎస్.ఇ సంజీవ రెడ్డి, పంచాయితీ రాజ్ ఎస్ .ఇ కొండయ్య, డ్వామా పి.డి. వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ డెప్యూటీవ్ సి.ఇ.ఓ సాయి కుమారి, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Write comments