క్లీన్ స్వీప్ చేసినందుకు పట్టం

 

కర్నులు, ఆగస్టు 12 (globelmedianews.com):
చల్లా రామకృష్ణారెడ్డి సీనియర్ నేత. ఒకప్పుడు ఫ్యాక్షన్ లీడర్ గా ముద్రపడిన చల్లా రామకృష్ణారెడ్డి బనగాన పల్లి కేంద్రంగా తన రాజకీయాలను నడుపుతున్నారు. ఇప్పటికీ పట్టున్న నేతగా చల్లా రామకృష్ణారెడ్డికి గుర్తింపు ఉంది. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పట్లో చంద్రబాబు చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హమీ ఇచ్చారు. అందుకోసమే బనగానపల్లి నుంచి బీసీ జనార్థన్ రెడ్డిని చల్లా దగ్గరుండి గెలిపించారు.2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా చల్లా రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. ఎన్ని సార్లు అవకాశమొచ్చినా చంద్రబాబు చల్లాను దూరం పెట్టారు. 
క్లీన్ స్వీప్ చేసినందుకు పట్టం

దీంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఆయనను పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ గా నియమించారు. అసంతృప్తితోనే ఆ పోస్టును చేపట్టిన చల్లా రామకృష్ణారెడ్డి 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. నేరుగా లోటస్ పాండ్ కు వచ్చి తాను వైసీపీలో చేరినట్లు ప్రకటించారు.చల్లా రామకృష్ణారెడ్డి పార్టీలో చేరినప్పుడే జగన్ ప్రామిస్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని జగన్ మాట ఇచ్చారని చల్లా అనుచరులు కూడా చెప్పారు. ఆయన కుమారుడు చల్లా భగీరధరెడ్డి రాజకీయ భవిష్యత్తును కూడా తాను చూసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు చల్లాను ఎమ్మెల్సీ చేయడంతో జగన్ మాట ఇస్తే తప్పరన్నది రుజువైందంంటున్నారు చల్లా అనుచరులు. కర్నూలు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు చల్లా పదవి ఉపయోగపడుతుందంటున్నారు పార్టీ అభిమానులు.

No comments:
Write comments