గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి,

 

నగర వాసులు కమిటీ సూచనలను పాటించండి
వాటర్ ట్యాంకులకు ప్రత్యామ్నాయ రోడ్డు ఏర్పాటు 
తిరుపతి, ఆగస్టు 7 (globelmedianews.com)
వినాయకసాగర్ తిరుపతి నగర ప్రజలు పవిత్రంగా వినాయక  నిమజ్జనం చేసే ప్రాంతం, త్వరలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చేయాల్సి వున్నది, నగరంలో బిల్డింగ్ వెస్ట్ మెటీరీయల్ వినాయకసాగర్ లో పడేస్తున్నారు, చట్టరీత్యా నేరం , పోలీస్,  టౌన్ ప్లానింగ్ అధికారులు నిఘావుంచి వాహనాలు సీజ్ చేయాలని నగరపాలక కమిషనర్ మరియు తుడ వి.సి. గిరిషా పి.ఎస్. ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక వినాయక సాగర్ లో నిమజ్జనం రోజు చేయవలసిన  ఏర్పాట్లు వరసిద్దివినాయక నిమజ్జనం కమిటీ తో కలసి తుడ విసి పరిశీలించారు. కమిషనర్  మాట్లాడుతూ ఈ సారి జరిగే ఉత్సవాలు ఆదర్శంగా వుండాలని , వినాయక సాగర్ అభివృధ్ధి  స్మార్ట్ సిటీ లో వుందని మరో సంవత్సరంలో రూపురేఖలు మారి అందంగా వుంటుందని అన్నారు. ఈసారి జరిగే వుత్సవాలకు  నిమజ్జన ప్రాతంలో పిచ్కి మొక్కల తొలగింపు, ర్యాంపుల ఏర్పాటు, ప్రస్తుతం వున్న నీటిని గాల్ఫర్ సహాయంతో వారంలోపు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 
గణేష్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించాలి, 

ఆతరువాత మంచి నీటిని నింపే ఏర్పాటు చేయాలని కనీసం 20 రోజులు నింపాల్సి వుంటుందని తేలిపారు. ప్రధానంగా నగరంలోని బిల్డింగ్ వెస్ట్ మెటీరియల్ వినాయకసాగర్ లో తోలుతున్నారని, వాటర్ ట్యాంక్ మూతలు లేకుండా కట్టపై వెళ్ళడం వల్ల నీళ్ళు  తొలికి రోడ్డు గుంతల మయం గా మారుతున్నదని కట్టడి చేయాలని కమిషనర్ కు విన్న స్థానికులు విన్నవించారు. కమిషనర్ డిఎస్పీ మురళీకృష్ణ కు సూచిస్తూ ఇప్పటి నుండే నిఘావుంచి ఇక్కడ  బిల్డింగ్ వెస్ట్ తోలే వాహనాలను సీజ్ చేయాలని , వాటర్ ట్యాంకర్లకు కట్ట దిగువన వున్న రోడ్డు  వాడే విధంగా రెండు, మూడు రోజుల్లో దారి సిద్దం చేయాలని నగరపాలక ఇంజనీర్లను ఆదేశించారు. చిన్న , మద్య, పెద్ద విగ్రహాల నిమజ్జనం జరిగే మూడు  ప్రాంతాలను పరిశీలించారు. గతంలో లాగే ర్యాంపుల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని, అత్వశారా రహదారిగా ఉద్యాన శాఖ కార్యలయం నుండి నిమజ్జనం అనంతరం భక్తులు బయటకు వెళ్ళేలా రహదారి , ర్యాంపు ఏర్పాటు చేయాలని తేలిపారు. కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణకు ఇచ్చే సూచనులు నగర వాసులు పాటించాలి, మీడియా కూడా భాగస్వామ్యులై మట్టి విగ్రహాల ప్రాముఖ్యత, పర్యావరణ అనర్ధాలకు దారితీసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగులు ప్రచారం చేపట్టాలని అన్నారు. కమిషనర్  వినాయకసాగర్ పర్యటనలో  తుడ సెక్రటరీ రామసుందర రెడ్డి, పర్యావరణ సంస్థ ఈఈ నరేంద్ర కుమార్, నగరపాలక సంస్థ డి.ఇ. ఎలక్ట్రికల్  శ్రీధర్, ఎం.ఇ. చంద్రశేఖర్, టీటీడీ ఇ. ఇ. మనోహర్ , . డి ఇ సహదేవరెడ్డి, తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ  కన్వీనియర్ సామంచి శ్రీనివాస్,  సభ్యులు నవీన్ కుమార్ రెడ్డి, ఆర్.సి.మునికృష్ణ, గూండాల గోపీనాధ్ ,  వెంకటేశ్ , శ్రీనివాసరావు, భాస్కర్  వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు

No comments:
Write comments