ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టుల పరిశీలకు సీఎం కేసీఆర్

 

వనపర్తి ఆగష్టు 16 (globelmedianews,com - Swamy Naidui):
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పనుల పురోగతిని పరిశీలించే నిమిత్తం త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా శుక్రవారం ఆయన పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు అతిథిగృహంలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో సమావేశమై రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పాత పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల పై సూక్ష్మస్థాయిలో సమీక్షించే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే జిల్లాలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారని చెప్పారు. 

ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాజెక్టుల పరిశీలకు సీఎం కేసీఆర్
ఈ సమీక్ష సందర్భంగా ప్రాజెక్టుల పనులు, సమస్యలు అన్నింటిపై సమీక్షించిన అనంతరం ప్రాజెక్టుల పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్ల నున్నట్లు తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్ల సూచనలను తీసుకోవడం జరిగిందని, జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు,కలెక్టర్ల సూచనలు , రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించడం జరుగుతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి పర్యటన ఉంటుందని తెలిపారు.  మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ.శ్రీధర్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు

No comments:
Write comments