బాక్సాఫీసు వద్ద రాక్షసుడు కాసులు

 

హైద్రాబాద్, ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం తొలి రోజు పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు రూ.1.5 కోట్లకు పైగా వసూలు చేసిందని అంచనా. మొత్తంగా రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ‘రాక్షసుడు’ రూ.3.58 కోట్ల షేర్ వసూలు చేసిందని సినీ వర్గాల సమాచారం. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి ఆదివారం కలెక్షన్లు మరింత పెరుగుతాయని అంటున్నారు.
 బాక్సాఫీసు వద్ద రాక్షసుడు కాసులు
ఇప్పటికే షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి. మొత్తం మీద తొలి వీకెండ్ ‘రాక్షసుడు’ కుమ్మేయడం ఖాయమంటున్నారు. మరోవైపు యూఎస్‌లో కూడా ‘రాక్షసుడు’ డీసెంట్ కెలక్షన్స్ రాబడుతున్నాడు. ప్రీమియర్స్, శుక్రవారం కలుపుకుని 31,200 డాలర్లు (సుమారు రూ.21.73 లక్షలు) వసూలు చేసిన ఈ చిత్రం శనివారం 35,100 డాలర్లు (సుమారు రూ.24.45 లక్షలు) రాబట్టింది. మొత్తంగా శనివారం ముగిసేసరికి యూఎస్‌లో ‘రాక్షసుడు’ గ్రాస్ 66,300 డాలర్లు. అంటే సుమారు రూ.46.18 లక్షలు. ప్రపంచ వ్యాప్తంగా ‘రాక్షసుడు’ థియేట్రికల్ హక్కులు రూ.14 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని రెండో వారం ముగిసేలోపే రాబట్టడం ఖాయమని అంటున్నారు. 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ‘రాక్షసుడు’ రెండు రోజుల షేర్ వివరాలు 
నైజాం - రూ. 1.38 కోట్లు 
సీడెడ్ - రూ. 54 లక్షలు 
నెల్లూరు - రూ. 13 లక్షలు 
గుంటూరు - రూ. 29 లక్షలు 
కృష్ణా - రూ. 24 లక్షలు 
పశ్చిమ గోదావరి - రూ. 20 లక్షలు 
తూర్పు గోదావరి - రూ. 24 లక్షలు 
ఉత్తరాంధ్ర - రూ. 55 లక్షలు 
మొత్తం - రూ. 3.58 కోట్లు

No comments:
Write comments