సిక్కింను ఊడ్చేశారు

 

గ్యాంగ్ టక్, ఆగస్టు 16 (globelmedianews.com)
పవన్ చామ్లింగ్ సిక్కింలో నిన్న మొన్నటి వరకూ తిరుగులేని నేత. ఆయన దాదాపు 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సిక్కిం అంటేనే పవన్ చామ్లింగ్ గుర్తుకొస్తారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ చామ్లింగ్ పార్టీ ఓటమి పాలయింది. ఓడిపోయినా ఆయన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కాయి. ఇప్పుడు బీజేపీ కన్ను సిక్కింపై పడింది. పవన్ కుమార్ చామ్లింగ్ ను టార్గెట్ చేసింది. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి చామ్లింగ్ ను పెద్ద దెబ్బే కొట్టారు.సిక్కింలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కుమార్ చామ్లింగ్ కు చెందిన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ 13 స్థానాలు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది. సిక్కిం క్రాంతికార్ మోర్చా పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది. నిజానికి సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ పార్టీ సుదీర్ఘకాలం అధికారంలో ఉందని చెప్పాలి. 1994 నుంచి మొన్నటి వరకూ ఇక్కడ ముఖ్యమంత్రి గా పవన్ కుమార్ బన్సాల్ కొనసాగారు. 
సిక్కింను ఊడ్చేశారు

ఆయన తనకు ఎదురు లేదనుకున్నారు.పవన్ కుమార్ చామ్లింగ్ 25 ఏళ్ల పాటు అధికారంలో ఉండటంతో సహజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. 1994, 1999,2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించిన చామ్లింగ్ అయిదు దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి ఆయన అధికారంలోకి వచ్చేందుకు కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టారు.ప్రజల ఆదాయం, సంపదతో సంబంధం లేకుండా తన వంతుగా ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికీ నెలనెలా కనీస ఆదాయం సమకూర్చాలన్నదే చామ్లింగ్ ఆలోచన. అయితే ఈ ఎత్తుగడ ఎన్నికల్లో ఫలించలేదు.సిక్కిం శాసనసభలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలుండగా అందులో 13 మంది మాత్రమే విజయం సాధించారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ బోణీ కూడా కొట్టలేదు. అయినా తాజాగా పది మంది సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్యేలకు కండువా కప్పేయడంతో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినట్లయింది. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం ఒక్కటే బీజేపీకి మింగుడుపడలేదు. ఈ ఆపరేషన్ తో అక్కడ ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నట్లయింది. మొత్తం మీద పవన్ కుమార్ చామ్లింగ్ కు ఇది గట్టి దెబ్బేనని చెప్పకతప్పదు.

No comments:
Write comments