భారీ సంస్కరణలకుశ్రీకారం చుట్టిన కర్ణాటక బీజేపీ

 

బెంగళూరు ఆగష్టు 22 (globelmedianews.com
రాష్ట్ర బీజేపీలో భారీ సంస్కరణలు చేపట్టే ఆలోచనలో కొత్త అధ్యక్షుడు ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ జాతీయ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా దక్షిణకన్నడ ఎంపీ నళిన్‌కుమార్‌ కటీల్‌ గురువారం అధ్యక్ష పదవిని అలంకరించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న తరుణంలోనే అధ్యక్షస్థానం దక్కడం సంతోషం అంటూనే గ్రామస్థాయి నుం చి రాష్ట్రం దాకా పార్టీకి కొత్తశక్తి నింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
భారీ సంస్కరణలకుశ్రీకారం చుట్టిన కర్ణాటక బీజేపీ

సీఎం యడియూరప్ప సీనియర్‌ నేత అంటూ కొనియాడుతూనే ఆయన అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో జిల్లాధ్యక్షులతోపాటు రాష్ట్ర కార్యవర్గంలో మార్పులు అనివార్యమని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. నేనొక సామాన్య కార్యకర్తనని చెప్పుకుంటూనే బాల్యం నుంచి ఆర్‌ఎ్‌సఎస్‌ భావాలతో ఎదిగానని పార్టీ మిన హా నాకు మరో ఆలోచన ఉండదని మంగళూరులో బుధవారం కార్యకర్తలను ఉద్దేశించి అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా సమీక్షలు జరిపి పార్టీ కోసం అనునిత్యం పనిచేసేవారికి ప్రాధాన్యత ఉంటుందని జిల్లా కమిటీ అంటే గ్రామగ్రామాన పార్టీని ప్రగతిదిశగా తీసుకెళ్ళే కూటమిగా మార్చాలన్నదే నా ఆలోచన అని స్పష్టం చేసినట్టు సమాచారం. దీ న్ని బట్టి మరికొన్ని రోజుల్లోనే వివిధ జిల్లాలకు అధ్యక్షుల మార్పు అనివార్యం అవుతుందనిపిస్తోంది. ఇక రాష్ట్ర పార్టీ కమిటీ కూడా మార్పు తథ్యం అనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమింపబడిన నళిన్‌కుమార్‌ కటీల్‌ బుధవారం మంగళూరుకు తెల్లవారు న రైలులో 5.30గంటలకు చేరుకోగా పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వాగతించారు. అక్కడనుంచి నివాసం దాకా భారీ ర్యాలీ జరిపారు.

No comments:
Write comments