అంధకారంలో గిరిజన గ్రామాలు

 

బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు. 
పట్టించుకోని విద్యుత్ అధికారుల వైనం
విజయనగరం, ఆగస్టు 17 (globelmedianews.com)
విజయనగరం జిల్లా సాలూరు మండలం సుమారు మూడు పంచాయతీల్లో సంపంగి పాడు ,పంచాయతీ సారికి పంచాయతీ ,డెన్సరాయ్ పంచాయతి,ల్లో సుమారు 10 గ్రామాలు వరకు గత 20 రోజుల నుంచి విద్యుత్ లేకపోవడం వల్ల గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కర్రిగుడి సలపరిబంద ,గండ్ర గొయ్యి, గొట్టిపాడు  ,డెన్స్ రాయి ,మర్రివలస ,రావడి వలస ,కొత్తూరు ,ఎగువ రూఢి ఇలా పలు గిరిజన గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలిగింది 
అంధకారంలో గిరిజన గ్రామాలు

అధికారులకు ఎన్ని రకాలుగా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్ట్రికల్ ఏఈ గారికి విన్నవించుకున్న అప్పటికీ లైన్మెన్ పంపిస్తామని చెబుతున్నారు కానీ  ఎవరు రాకపోవడంతో గిరిజనులు నిరాశకు గురవుతున్నారు. రాత్రయ్యేసరికి విష ప్రాణులు సంచరిస్తున్నాయి చీకట్లో లో బయటకు రాలేక బిక్కుబిక్కుమంటూ ఇంట్లో రాత్రులు గడుపుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి మాకు విద్యుత్ అందజేస్తారని కోరుకుంటున్నాము.మరో ఏమిటంటే ఇక్కడ గిరిజన ఎమ్మెల్యే ,ఎంపీ ,ఎమ్మెల్సీ, సాక్షాత్తు డిప్యూటీ సీఎం కూడా గిరిజనులైన పటికి గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజన నాయకులు అంటున్నారు.

No comments:
Write comments