రక్షాబంధన్

 

ఏలూరు, ఆగష్టు 12 (globelmedianews.com - Swamy Naidu )
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆళ్లనానికి బ్రహ్మకుమారీస్ సోమవారం రక్షాబంధన్ కట్టి గౌరవించారు. స్థానిక మంత్రి కేంపు కార్యాలయంలో సిస్టర్ లావణ్య,  ప్రకాష్ రావులతోపాటు పలువురు బ్రహ్మకుమారీ సంస్థ ప్రతినిధులు రక్షాబందన కార్యక్రమంలో పాల్గొన్నారు.


 రక్షాబంధన్ 
బ్రహ్మకుమారీస్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తనవంత సహకారం అందిస్తానని సమాజంకోసం పాటుపడుతున్న బ్రహ్మకుమారీస్ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తానని, ముఖ్యంగా కాలుష్య నివారణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టే స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ పరంగా అవసరమైన మొక్కలను ఉచితంగా సమకూరుస్తానని పచ్చని వాతావరణం ఉన్నప్పుడే కాలుష్యాన్ని నివారించగలుగుతామని, ఇంటింటా మొక్క నాటేలా స్వచ్చంధ సంస్థల పభ్యులు ముందుకు రావాలని ఆళ్లనాని కోరారు. భవిష్యత్ లో మానవ మనుగడతోపాటు జీవరాశులు కూడా జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించాలని అందుకు మొక్కుల పెంపకం ప్రజాఉధ్యమంగా సాగాలని  నాని కోరారు.

No comments:
Write comments