చెరువుకు గండి.. వృధాగా పోతున్న నీరు

 

వరంగల్, ఆగస్టు 5, (globelmedianews.com - Swamy Naidu)
గత రెండు నెలలుగా రైతన్నలను మురిపించిన వరుణుడు.చివరకు కరుణించడంతో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో చెరువులోకి,కుంటాల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.  మరోవైపు,  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ రావు మండలం ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బొమ్మారపు చెరువు కు2 రోజుల క్రితం గండి పడటంతో నీరు మొత్తం వృధాగా దిగువకు పోతుంది. 
చెరువుకు గండి.. వృధాగా పోతున్న నీరు
గత సంవత్సరం కూడా ఖరీఫ్ సాగు లో ఇలాగే జరిగితే రైతులంతా కలిసి సిమెంటు సంచుల తో ఇసుకను నింపి నీరు దిగువకు వెళ్ళకుండా కట్టకు అడ్డం వేశారు.మళ్ళీ ఈ సంవత్సరం కూడా వర్షాలు కురవడంతో అడ్డుగా వేసిన ఇసుక సంచులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఈ చెరువు కింద సుమారు 1400వందల ఎకరాల ఆయకట్టు సాగుచేస్తున్నారు.రెండు రోజుల నుండి నీరు వృధాగా పోతుండంతో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని,ఈ చెరువు క్రింద మూడు గ్రామాలకు చెందిన రైతులకు భూములున్నాయని.నీరు అంతా దిగువకు వెళ్లక మేము ఎలా బ్రతికేదనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

No comments:
Write comments