పది మంది క్రికెట్ బుకీలు అరెస్టు

 

అనంతపురం ఆగస్టు 29, (globelmedianews.com)
జిల్లాలో ఎక్కడా క్రికెట్ బెట్టింగు జరుగరాదని ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు గట్టి ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో తాడిపత్రి పట్టణ సి.ఐ తేజోమూర్తి, ధర్మవరం రూరల్ సి.ఐ చిన్న పెద్దయ్య, తాడిపత్రి పట్టణ ఎస్ ఐ ఖాజా హుస్సేన్ , బత్తలపల్లి ఎస్ ఐ రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో సిబ్బంది తాడిపత్రి హెడ్ కానిస్టేబుల్ రఘు, కానిస్టేబుళ్లు భాస్కర్ , శీనానాయక్ , గోవింద్ లు... ధర్మవరం రూరల్ హెడ్ కానిస్టేబుల్ రామదాసు, తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి కానిస్టేబుళ్లు సతీష్ కుమార్ , సుబ్బ, నాగార్జన, మాబు హుస్సేన్ , హరినాథ్ రెడ్డిలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. తాడిపత్రి పట్టణంలోని ఓ ఇంట్లో ఈ నిందితులంతా సమూహంగా ఏర్పడి క్రికెట్ బెట్టింగు నిర్వహిస్తున్నట్లు ఈ ప్రత్యేక బృందం పోలీసులు పక్కా సమాచారం అందుకున్నారు.
పది మంది క్రికెట్ బుకీలు అరెస్టు

కర్నాటక రాష్ట్రం మైసూరు వేదికగా బళ్లారి, s బెళగావి జట్ల మధ్య జరుగుతున్న కె.పి.ఎల్ ( కర్నాటక ప్రీమియర్ లీగ్ ) క్రికెట్ టోర్నీ మ్యాచ్ లలో  బెట్టింగు నిర్వహిస్తున్న వీరిని అరెస్టు చేశారు.ధాన క్రికెట్ బుకీ, 20 కేసుల్లో నిందితుడైన సయ్యద్ జావెద్ ఖాద్రి @ జావెద్ తో పాటు పది మంది క్రికెట్ బుకీలను తాడిపత్రి మరియు ధర్మవరం సబ్ డివిజన్ల పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. వీరి నుండీ ఒక కమ్యూనికేటర్ బాక్సు, రెండు ల్యాప్ టాప్ లు, 33 సెల్ ఫోన్లు, ఇయర్ మైకు, 2,125 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగు, గంజాయి కేసులతో పాటు హత్య, హత్యాయత్నం, గొడవలు, దాడులు కేసులు జావెద్ పై ఉన్నాయి. మిగితా నిందితులపై కూడా క్రికెట్ బెట్టింగు, గంజాయి కేసులు ఉన్నాయి. గురువారం జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు అనంతపురంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.  వీరినుంచి  ఒక కమ్యునికేటర్ బాక్సు * రెండు ల్యాప్ టాప్ లు,  33 సెల్ ఫోన్లు, ఇయర్ మైకు, 2,125 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.   ప్రస్తుతం అరెస్టయిన వీరిలో సయ్యద్ జావెద్ ఖాద్రి @ జావెద్ చాలా కీలక నిందితుడు. రౌడీషీటర్ కూడా. క్రికెట్ బెట్టింగ్ డాన్ అయిన ప్రొద్దుటూరు నరసింహకు అత్యంత సన్నిహితుడు. అతడి సహకారంతో క్రికెట్ బెట్టింగ్ ముమ్మరంగా కొనసాగించాడు. ఐ.పి.ఎల్ , వర్ల్డ్ కప్ , కె.పి.ఎల్ మ్యాచ్ ల్లో జోరుగా పందేలు నిర్వహించాడు. కమ్యూనికేటర్ బాక్సులో 26 మొబైల్ ఫోన్లు అనుసంధానించి వాటి సహాయంతో ఫంటర్ల నుండీ పందేలు స్వీకరిస్తాడు. ప్రస్తుతం అరెస్టయిన మిగితా తన సహచరుల ద్వారా ల్యాప్ టాప్ లలో ఫంటర్లు కాచిన పందేల వివరాలు నమోదు చేసుకుని ఆతర్వాత లావాదేవీలు నిర్వహించే వాడు. ప్రతీ మ్యాచ్ లోనూ రూ. లక్షల్లో పందేలు నిర్వహించాడు. మన జిల్లాలోనే కాకుండా రాష్టంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుండీ కూడా పందేలు స్వీకరించి క్రికెట్ లావాదేవీలు కొనసాగించాడు. క్రికెట్ బెట్టింగులతో పాటు హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు, దాడులు, గంజాయి విక్రయం కేసుల్లో కూడా ఇతను నిందితుడు. తాడిపత్రి, అనంతపురం, ధర్మవరం పోలీసు స్టేషన్ల పరిధుల్లో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతనిపై 20 కేసులు ఉన్నాయి. ఇతనితో పాటు మిగితా తొమ్మిది మంది కూడా క్రికెట్ బుకీలే. వీరు కూడా స్థానిక ఫంటర్ల నుండీ క్రికెట్ పందేలు సేకరించి జావెద్ ద్వారా బెట్టింగు నిర్వహిస్తున్నారు. వీరందరిపైన క్రికెట్ బెట్టింగు మరియు గంజాయి కేసులున్నాయి. గత ఒకటిన్నర సంవత్సర కాలంగా కళ్లు గప్పి తన అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ అందుకు తగ్గట్టుగానే ఇతను సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాడు. క్రికెట్ బెట్టింగు వ్యవహారంలో కమ్యూనికేటర్ బాక్సు వినియోగం దాటేసి వివిధ మొబైల్ యాప్ ల ద్వారా లేటేస్ట్ గా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నాడని ఎప్పీ వెల్లడించారు.

No comments:
Write comments