అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం

 

జోగులాంబ గద్వాల ఆగస్టు 03 (globelmedianews.com - Swamy Naidu)
 భారత రాజ్యాంగ నిర్మాత డా.ఆర్ అంబేద్కర్  ఆశయ సాధన కోసం కృషి చేద్దామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.  శనివారం  ధరూర్ మండలం లోని  పరిధిలోని  మార్లబీడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్యఅతిధి  గా అయన పాల్గోన్నారు.  ఈ కార్యక్రమానికి ఢిల్లీ  అధికార ప్రతినిధి మందా జగన్నాథం,  తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప తదితరులు హజరయ్యారుఉ. ఎమ్మెల్యే మాట్లాడుతూ  మార్లబీడు గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రతిష్ట సందర్భంగా  అందరికి శుభాకాంక్షలు   తెలిపారు.  ఈ గ్రామంలోని  అన్ని మతాలు కులాలు కలిసి మెలిసి ఉంటారని తెలిపారు.  నాకు సొంత ఊరు  లాగానే మార్లబీడు గ్రామం. 

 అంబేద్కర్  ఆశయ సాధన కోసం కృషి చేద్దాం
నేటి యువత అంబేద్కర్ గారి ఆలోచనలు స్పూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు ప్రపంచంలో అత్యంత మేధావిగా గుర్తింపు పొంది నేటి సమాజంలో సమాన అవకాశాలను సృష్టించిన ఘనత అంబేద్కర్ గారికే దక్కుతుందన్నారు వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ ఫలాల మూలంగా నేడు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అవకాశాలు దక్కుతున్నాయని అని తెలిపారు. ఇది అంబేద్కర్ ముందు చూపుకు నిదర్శనమన్నారు. అంబేద్కర్  తన జీవితం అంతా కూడా పేదల అభ్యున్నతి కోసం చేశారు నేటి యువతకు మార్గదర్శకుడు మార్లబీడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం శుభ పరిణామమని ఆయన ఆశయాలను మనమందరం కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీపీ నజ్మున్నిసా బేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్  సుజాత శ్రీరాములు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్   సింగిల్ విండో అధ్యక్షుడు సేసాల వెంకట్ రెడ్డి తెరాస నాయకులు ధరూర్ నర్శింహ రెడ్డి,  శ్రీనివాస్ రెడ్డి, వైండింగ్ రాములు  జాకీర్.  రాఘవేంద్ర రెడ్డి ఆనంద్ రెడ్డి  పూడూర్ చిన్నయ్య   భీమ్ రెడ్డి మన్యం  మరియు  నాయకులు కార్యకర్తలు మహిళలు   తదితరులు పాల్గొన్నారు

No comments:
Write comments