రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం అద్భుత పాలననా?

 

కెసిఆర్ ఫై నిప్పులు చెరిగినా పొన్నాల 
 హైదరాబాద్ ఆగష్టు 17  (globelmedianews.com)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15 నుండి అద్భుత పాలన చేస్తా నన్నాడని ఈ రోజు నుండి ఆరోగ్యశ్రీ పనిచేయకపోవడం ఇదేనా అద్భుత పాలన అని  మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయినారు. శనివారం తన నివాసం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్,రైతుబందు ,పెండింగ్ లో ఉన్నాయి ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2లక్షల కు పైగా రాష్ట్రం అప్పులపాలులో ఉందని,108 ఉద్యోగులకు జీతాలు లేవు.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని 6 మాసాలు గడచిన ఇంతవరకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదని ,ఫీజు రీ అంబర్స్ మెంట్ నుకాలరాస్తున్నది మీరు కాదా కేసీఆర్ అని ప్రశ్నించారు.ప్రజా ప్రతినిధులు నాటిన చెట్లు కపడకపోతే ఉద్యోగాలు పోతున్నాయి.
రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడం అద్భుత పాలననా?

ఇదేనా ప్రజా రంజక పాలన అని ప్రశ్నించారు. అంటే గత 5 సంవత్సరాల నుండి ప్రజా కంఠక పాలన ఉంది అని ఒప్పుకుంటున్నారా అని ప్రశ్నించారు.మరి కేసీఆర్ చేసిన అన్యాయలపై ప్రజలు ఎలాంటి శిక్ష వేయాలన్నారు.అంగన్ వాడి లలో మహిళలకు పౌష్టిక ఆహారం,పాలు ఇంతవరకు ఇవ్వడం లేదన్నారు. 9మాసాల నుండి సర్పంచ్ లకు ఉంతవరకు చెక్ పవర్ ఇవ్వలేదన్నారు.కేసీఆర్ అవినీతికోసం అనేక కొత్త పథకాలు తీసుకువస్తున్నారని విమర్శించారు.కొత్త చట్టాలు తీసుకువస్తామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నాడన్నారు.కొత్త మున్సిపల్ చట్టం తెస్తానన్న ఈ కేసీఆర్ ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే... కొండనాలుకకు మందేస్తే,ఉన్ననాలుకకు ఊడినట్టు ఉంది కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టం తీరన్నారు.హై కోర్టు కేసీఆర్ ప్రభుత్వం మీద అక్షింతలు వేస్తుంది.కొత్త మున్సిపల్ చట్టం పైన మీది తప్పు లేకుంటే మీరూ సీబీఐ  ఎంక్వైరీ కి సిద్ధం కావాలన్నారు.మా రాష్ట్రానికి ఏమీ వద్దు కేవలం మీ ప్రేమ చాలు మోడీఅన్నాడు కేసీఆర్.తన అవినీతి బయటపడకుండా ఇవన్నీ కేసీఆర్ ఎత్తులన్నారు. కేసీఆర్ తెలంగాణ వాడు కాదు అందుకే తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడన్నారు.కేసీఆర్ నువ్వు తెలంగాన వాడివి కాకున్నా...నువ్వు తెలంగాణకు మంచి చేస్తే నమస్కరిస్తాన్నారు.

No comments:
Write comments