కృష్ణమ్మ ఉగ్రరూపం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

 

విజయవాడ ఆగష్టు 16 (globelmedianews.com)
ఎగువ నుండి భారీగా వరద నీరు చేరుతుండటంతో.. ప్రమాద స్థాయి లో ప్రవహిస్తూ కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది.  శుక్రవారం అమరావతి మండలం మద్దూరులో కొండకి ఆనుకుని ఉన్న ఎస్టీ కాలనీలో కి కఅష్ణా వరద నీరు చేరింది. అధికారులు అప్రమత్తమై అక్కడి నుండి కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  మరో వైపు.. జిల్లాలోని వాగులు పొంగుతున్నాయి. పల్లపు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.  
కృష్ణమ్మ ఉగ్రరూపం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

కొల్లిపర మండలం కఅష్ణా పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి.  ప్రకాశం బ్యారేజి నుండి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయటంతో.. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి రైతులు ఆందోళన చెందుతున్నారు.  కృష్ణా నది వరదలతో అమరావతి మండలం పెదమద్దురు వాగు పొంగుతోంది.  శివారు నివాసాలన్నీ జలమయమయ్యాయి.  ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సామాన్లతో పాటు కాలనీవాసులను ఖాళీ చేయించారు. 

No comments:
Write comments