గాడిన పడుతున్న రైల్వేలు

 

లక్నో, ఆగస్టు 30, (globelmedianews.com)
రైల్వేలు నెమ్మది నెమ్మదిగా ప్రైవేటు పట్టాలెక్కే ప్రయత్నాలు మొదలైంది. అయితే.. దీనికి ముందు కొన్ని శుభవార్తలు ప్రయాణికులకు రైల్వేశాఖ చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రైలు ఆలస్యంగా నడిస్తే.. ప్రయాణికులకు నష్టపరిహారం అందుతుందని.. త్వరలో ఈ విధానం అమల్లోకి రానున్నట్లుగా తెలుస్తోంది. రైలు తాను చేరాల్సిన గమ్యస్థానానికి గంట కంటే ఎక్కువ ఆలస్యంగా నడిచినపక్షంలో కొంత మొత్తాన్ని పరిహారం కింద.. ప్రయాణికుల ఈ వాలెట్ కు తిరిగి ఇవ్వాలన్న విధానం అమల్లోకి తేనున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. దేశంలో తొలి ప్రైవేటు రైలును ఐఆర్ సీటీసీ నడిపించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ - లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్ ప్రెస్ రైలును తొలి దేశీయ ప్రైవేటు రైలుగా చెబుతున్నారు. 
గాడిన పడుతున్న రైల్వేలు

దీనికి ప్రయాణికుల నుంచి వచ్చే ఆదరణకు అనుగుణంగా ముంబయి-అహ్మదాబాద్ మధ్య కూడా రైలును నడపనున్నారు. ఈ రైళ్లు విమాన ఛార్జీల కంటే తక్కువ ధరకు లభించే వీలుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ తేజస్ రైళ్లలో ప్రస్తుతం అమల్లో ఉన్న రాయితీలు ఏమీ అమలు కావని చెబుతున్నారు. పిల్లలకు ఫుల్ టికెట్ తీసుకోవాలని.. సీనియర్ సిటిజన్లు మొదలుకొని వివిధ వర్గాల వారికి ఇచ్చే రాయితీలేవీ ఈ రైళ్లకు ఇవ్వరని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రైళ్లలో టికెట్ ధరలు ఎంత ఉండాలన్న విషయంలో ఐఆర్ సీటీసీకి తగినంత స్వేచ్ఛ ఇస్తారట. ఈ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ బీమా సౌకర్యాన్ని ఇవ్వనున్నారు. ప్రస్తుతం 53 విభాగాల్లో ఇచ్చే రాయితీల్ని ఈ రైల్లో ప్రయాణించే వారికి వర్తించవని స్పష్టం చేస్తున్నారు. సో.. రానున్న రోజుల్లో ప్రైవేటు రైళ్లకు పెద్దపీట వేసి.. ప్రభుత్వ రైళ్లను పక్కన పెడితే.. సామాన్య ప్రయాణికులకు చుక్కలు కనిపించటం ఖాయం. 

No comments:
Write comments