స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

 

కర్నూలు, ఆగస్టు 03,(globelmedianews.com - Swamy Naidu):
ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ పండుగ 73 వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను కనులపండుగలా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పకడ్బంధీగా చేయాలని అదికారులను జిల్లా కలెక్టర్ జి.వీరాపాండియన్ ఆదేశించారు. శనివారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్ సమీక్షిస్తూ 73 వ స్వాతంత్ర దినొత్సవ  వేడుకలను జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా వున్నఅన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాల్లో  తప్పని సరిగా వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండా వందనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు 

జిల్లా స్థాయి వేడుకలను కర్నూలు నగర పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం నియమించే గౌరవ మంత్రి  ద్వారా జాతీయ జెండా వందనం గావించడానికి, పోలీస్ పెరేడ్ నిర్వహణకు, సీటింగ్ ఏర్పాట్లను, షామియానా, త్రాగునీరు తదితర అన్ని ఏర్పాట్లను  బాగా చేయాలని ఏ.ఎస్.పి రాధాకృష్ణను, ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశించారు. అలాగే వర్షం వస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడ చేయాలని కలెక్టర్ సూచించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు స్వాతంత్ర్య సమరయేధులను, అందరు ప్రజాప్రతినిధులకు ఆహ్వాన పత్రికలను అందించి ఆహ్వానించాలని, అలాగే అదే రోజు సాయత్రం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో ఎట్ హోం కార్యక్ర నిర్వహణకు ఆహ్వానం పంపించి ఏర్పాటు ను చేయాలని ఆర్.డి.ఓ వెంకటేశ్వర్లను కలెక్టర్ ఆదేశించారు. పోలిసు పెరేడ్ గ్రౌండ్స్ లో ఏవైనా మర్మత్తులు వుంటే వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఇంజనీర్లను, శానిటేషన్, త్రాగు నీరు, ఏర్పాట్లను బాగా చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.స్వాతంత్ర్యదినోత్సవ అవార్డుల కోసం రెవెన్యూ, పోలిస్ ఇతర అన్ని శాఖల నుండి ఆత్యుత్తమ సేవలందించిన ఉద్యోగుల ఫోటో, పెరు, హోదా, ఆవార్డును ఎందుకు ఇస్తున్నది తదితర వివరాలను  ఈ నెల 10 వ తేది లోపు డి,ఆర్.ఓ లకు పంపాలని జిల్లా అధికారులను కలెక్టరు ఆదేశించారు. ఈ సారి అవార్డుల సంఖ్య ఎక్కువ కాకుండా ప్రతి శాఖ నుండి కేవలం ముగ్గురు లేదా పెద్ద శాఖలైతే హోదా విభాగానికి ఒకరి పేరును మాత్రమే పారదర్శకంగా పంపాలని కలెక్టరు ఆదేశించారు. జిల్దా అధికారులందరూ వారివారికి అప్పచెప్పిన విధులను తు.చ తప్పకుండా పాటించి స్వాతంత్రదినోత్సవ వేడుకలను అత్యుత్తమంగా, ఘనంగా,పండుగలా నిర్వహించాలని, ప్లాస్టిక్ జాతీయ జెండా ను ఎక్కడా కూడ ఉపయెగించకూడదని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ శెట్టి, డిఆర్.ఓ వెంకటేశం తో పాటు జిల్లా అధికారులందరూ సమావేశం లో పాల్గొన్నారు.

No comments:
Write comments