పట్టణాలలో రసాయనాల వినాయక విగ్రహాలు...... పల్లెల్లో మట్టి వినాయక విగ్రహాలు.....

 

వనపర్తి ఆగస్టు 26, (globelmedianews.com - Swamy Naidu
పట్టణాలలో రసాయనాలు పూసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం, పల్లెల్లో మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించడం వల్ల నిబంధనలు పల్లెలకు వర్తించి పట్టణాలకు వర్తించవని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామాలలో ఎవరు కూడా రసాయన పు విగ్రహాలను ప్రతిష్ఠించి రాదని, ఈ విగ్రహాలకు ఈ నాయకుడు కూడా విరాళాలు ఇవ్వరాదని, పర్యావరణాన్ని కాపాడడంలో అందరూ కృషి చేయాలని నాయకులు అంటున్నారే తప్ప ఇవి పట్టణాల వారికి వర్తించవని వారు ప్రశ్నిస్తున్నారు. 
 పట్టణాలలో రసాయనాల వినాయక విగ్రహాలు......   పల్లెల్లో మట్టి వినాయక విగ్రహాలు.....
సెప్టెంబర్ 2న వినాయక చవితి పండుగ ను పురస్కరించుకుని గ్రామాలలో ఇప్పటికే కొన్నిచోట్ల మట్టి విగ్రహాలను ప్రతిష్టించబోతుండగా మరికొన్ని చోట్ల రసాయన పు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించ పోతున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్లో సుమారు 61 అడుగుల వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అధికారులు నాయకులు సూచిస్తున్న ప్రకారంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించి వైభవంగా పూజలు నిర్వహిస్తే సరిపోతుంది కదని లువురు  వారి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

No comments:
Write comments