. దొంగనోట్ల దర్యాప్తు కొనసాగుతోంది

 

మంచిర్యాల ఆగస్టు 6, (globelmedianews.com - Swamy Naidu )
 మంచిర్యాల జిల్లా లక్షెట్టి పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 27న నమోదైన దొంగ నోట్ల కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని మంచిర్యాల ఎసిపి గౌస్ బాబా తెలిపారు. పత్తి వ్యాపారి ద్వారా హాజీపూర్ లో పట్టుబడిన దొంగనోట్ల కేసులో పలు పత్రికలు వాస్తవాలను వక్రీకరించి వ్రాస్తున్నాయని అది కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ నకిలీ 50 రూపాయల నోట్లు లభించిన కాగజ్ నగర్ లోని బ్యాంకు కు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయి వివరాలతో విచారణ కొనసాగుతుందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు దొరికినప్పుడు నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
దొంగనోట్ల దర్యాప్తు కొనసాగుతోంది
రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు మామూలు తీసుకొని కేసు నీరుగారుస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్త వాస్తవం కాదని, దీనికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే తమకు చూపించాలని కోరారు. దొంగ నోట్ల కేసు విచారణలో స్పెషల్ బ్రాంచ్, సి ఐ డి పోలీసులతో విచారణ కొనసాగుతుందని తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఆధారాలు లభించిన వెంటనే వారిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్న కేసు అయినందున మూలాల్లోకి వెళ్లి విచారణ జరపడం లో కొంత జాప్యం జరుగుతుందని  తెలిపారు.  ఈ కేసు కు సంబంధించిన సమాచారం ఉంటే మాకు అందజేసి విచారణలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ బి. నారాయణ నాయక్ మరియు ఎస్సై మధుసుధాన్ రావు లు పాల్గొన్నారు.

No comments:
Write comments