డ్రోన్ల సాయంతో అడవులతో విత్తనాలు

 

హైద్రాబాద్, ఆగస్టు 12  (globelmedianews.com):
తెలంగాణ రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతాలకు కొదువ లేదు. వాటిని మరింతగా అభివృద్ధి చేసేందుకు  తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్  టెక్నాలజీని వినియోగిస్తోంది. డోన్లతో అటవీ ప్రాంతాలలో విత్తనాలు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అడవుల్లో చెట్లు భారీ వర్షాలకు..బలమైన గాలులకు వేళ్లతో సహా కూలిపోతుంటాయి. మరికొన్ని కాలం తీరి చనిపోతుంటాయి. ఇంకొన్ని కార్చిచ్చులకు కాలిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్త మొక్కలు మొలకెత్తి అవి చెట్లుగా మారేందుకు..అడవులను అభివృద్ధి చేసేందుకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ డోన్ల ద్వారా విత్తనాలకు చల్లే ప్రయోగానికి నాంది పలికింది. 
 డ్రోన్ల సాయంతో అడవులతో విత్తనాలు

దట్టమైన అటవీ ప్రాంతాలలోకి మనుషులు వెళ్లి విత్తనాలు చల్లే వీలు పడదు. ఇటువంటి  ప్రాంతాలలో డోన్ల ద్వారా విత్తనాలు చల్లే కొత్త రకం ప్రయోగాన్ని ప్రారంభించింది. మనుషులు వెళ్లి విత్తనాలు నాటేందుకు వీలుపడని అడవుల్లో డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మేడ్చల్ జిల్లా చెంగిచర్ల రిజర్వ్ ఫారెస్టులో అటవీ అధికారులు  సోమవారం  డ్రోన్ల సాయంతో విత్తనాలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇటువంటి ప్రయోగాన్ని ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లో  అధికారులు అమలుచేశారు. అవి మంచి ఫలితాలనివ్వటంతో తెలంగాణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెంగిచర్ల రిజర్వ్ ఫారెస్ట్‌తో పాటు కీసర, లాల్‌గడి మలక్‌పేట రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లలో డ్రోన్ల సాయంతో భారీ వృక్షాల విత్తనాలను  అధికారులు డ్రోన్లతో  చల్లుతున్నారు.

No comments:
Write comments