కాఫీకి కేరాఫ్ అడ్రస్ గా 13 గ్రామాలు

 

విశాఖపట్టణం, సెప్టెంబర్ 11, (globelmedianews.com)
ఎగువశోభ పంచాయతీలో 13 గ్రామాలు. ఆయా గ్రామాల గిరిజనులకు వ్యవసాయం, కాఫీయే జీవనాధారం. మండలంలోని 12 పంచాయతీల్లోనూ ఎగువశోభ కాఫీ పెంపకంలో మొదటి స్థానంలోఉంది. ఎగువబీసుపురం, దిగువబీసుపురం, ఎగువశోభ రైతులు 1982 నుంచి కాఫీ తోటల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్నారు. పంచాయతీలోని 13 గ్రామాల్లో 215 మంది లబ్ధిదారులు
385 ఎకరాల్లో కాఫీ తోటలను సాగుచేస్తున్నారు. మిరియాలు కూడా పండిస్తున్నారు. వీరికి ఐటిడిఎ గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ప్రోత్సాహకాలు అందించలేదు. కాఫీ తోటల అభివృద్ధికి ఎకరాలకు
ఒక్కొక్క రైతులకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది.పంచాయతీలో బీసుపురం, కొత్తవలస, దిగువ బీసుపురంలో నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధికి కాఫీ జీవంపోస్తుందనడంలో అతిశయోక్తి కాదు.పంచాయతీలో బీసుపురం, కొత్తవలస, దిగువ బీసుపురంలో నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధితో జీవనం సాగిస్తున్నారు.
కాఫీకి కేరాఫ్ అడ్రస్ గా 13 గ్రామాలు

కాఫీ ప్లాంటేషన్‌చాపరాయి, బారుజోల, అరకు ప్రధాన రహదారి, సుంకరమ్టె వ్యూ-పాయింట్‌ కేంద్రంలో కాఫీపొడి, మిరియాలు, బొంగు చికెన్‌, వివిధ అటవీ ఉత్పత్తులు, పప్పు దినుసులు తదితర వస్తువులనువిక్రయించి ఉపాధి పొందుతున్నారు. దీనిపై సుమారు 30 మంది నిరుద్యోగులు ఉపాధి పొందుతున్నారు. బీసుపురం గ్రామానికి చెందిన శ్రీరాములు కాఫీ ఫౌడర్‌ను తయారు చేస్తున్నాడు. ఆయన వద్దకాఫీ ఫౌడర్‌ను కొనుగోలు చేసి అమ్మకాలు చేస్తున్నారు.1962లో పంచాయతీరాజ్‌ చట్టం అమలుకాగా 1972 - 73లో మొదటి ఎన్నికలు జరిగాయి. 1982-83 వరకు పూరిగుడెసెలోనేపంచాయతీ పాలన కొనసాగేది. 1985-86లో పంచాయతీ భవనం నిర్మాణం జరిగిందని మాజీ సర్పంచ్‌ పాంగి మొద్దు తెలిపారు.ఈ పంచాయతీలో ఒకే కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులు25 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించారు. మొదటి సర్పంచ్‌గా పాంగి చంద్రన్న, ఆ తరువాత అతని సోదరుడు పాంగి పండు చేపట్టారు. కాలాంతరంలో వీరిద్దరూ అనారోగ్యంతో కాలం చల్లారు. అప్పటినుంచి వారి వారసులు పాంగి మొద్దు 1977లో మొదటిసారి ఎన్నికై వరుసగా మూడు దఫాలు సర్పంచ్‌గా కొనసాగారు.పంచాయతీలో 13 గ్రామాలకు కొత్తవలస, దండబాబు, హెక్టగుడ, మర్దగుడ,బీసుపురం గ్రామాలు అరకు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నాయి. మిగిలిన దిగువశోభ, పొర్లపొదర్‌, గాడ్‌గుడ, జాముగుడ, కమలపురం, పూలగుడ, సర్సపొదర్‌, ఎగువశోభ గ్రామాలకు రహదారిసౌకర్యం అంతంతమాత్రమే. వారంతా కాలినడకనే పంచాయతీ కేంద్రానికి చేరుకోవాల్సిన పరిస్థితి.బీసుపురం నుంచి ఎగువశోభ వరకు రూ.1.50 కోట్లతో మెటల్‌ రోడ్డు, మర్దగుడ కూడలి నుంచిజాముగుడ, కమలపురం మీదుగా పూల్‌గుడ వరకు రూ.1.50 లక్షలతో మెటల్‌ రోడ్ల పనులు జరుగుతున్నాయి. బీసుపురానికి రూ.25 లక్షలు, మర్దగుడకు రూ.9 లక్షలు, కొత్తవలసలోరూ.2లక్షలతో సిసి రోడ్లు వేశారు. దండబాబుకు రూ.9 లక్షలు, జాముగుడకు రూ.9 లక్షలతో పనులు జరగాల్సివుంది.మర్దగుడ, ఎగువశోభ, జాముగుడ, బీసుపురం, దిగువశోభ, కొత్తవలసఅంగన్వాడీ కేంద్రాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటి భవనాల నిర్మాణం కోసం ఒక్కొక్క దానికి రూ.10లక్షల చొప్పున మంజూరైనట్లు పంచాయతీరాజ్‌ జెఇ మాణిక్యంతెలిపారు.పంచాయతీలో ఎగువశోభ, పూలుగుడ, సర్సపొదర్‌, జాముగుడ, దిగువశోభ, పొర్లపొదర, కమలపురం, బీసుపురం, దండబాబు, గాడ్‌గుడ గ్రామాలకు రూ.1.50 కోట్ల నిధులతో తాగునీటిపైప్‌లైన్‌ మరమ్మతులు చేపట్టారు దండబాడులో ఆరు మరుగుదొడ్ల పనులు పూర్తిచేసి 3 నెలలు గడుస్తుంది. జన్ని కామరాజు, వంతాల భాస్కర్‌, వంతాల రమేష్‌, వంతాల అర్జున్‌, జన్ని వెంకటరావు,చిట్టం మల్లన్న, జన్ని దొన్ను, చిట్టం అప్పలమ్మ, వంతాల సోనియాకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు.

No comments:
Write comments